జెర్సీ దర్శకుడితో రామ్ చరణ్.. మంతనాలు జరుపనున్న నిర్మాత

మళ్లీరావా, జెర్సీ చిత్రాలను తెరకెక్కించి.. ప్రేమ కథలను తెరపై ఎంత అందంగా చూపించగలడో నిరూపించుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. తీసింది రెండు సినిమాలే అయినా.. వాటి వల్ల వచ్చిన గుర్తింపు బాలీవుడ్ వరకు పాకింది. అందుకే జెర్సీ హిందీ రీమేక్ సైతం గౌతమ్ తెరకెక్కిస్తున్నాడు. అలా ఈ యంగ్ డైరెక్టర్ రేంజ్ మారిపోయింది. తాజాగా ఈ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

షాహిద్ కపూర్ హీరోగా..

షాహిద్ కపూర్ హీరోగా..

జెర్సీ చిత్రం తెలుగులో ఇంతటి ఘన విజయం సాధించడంతో.. హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ రీమేక్ ని అల్లు అరవింద్-దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని పోషించిన పాత్రను షాహిద్ కపూర్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది కూడా.

తదుపరి ప్రాజెక్ట్‌పై..

తదుపరి ప్రాజెక్ట్‌పై..

అయితే ఈ జెర్సీ రీమేక్ తరువాత చేయబోయే గౌతమ్ ప్రాజెక్ట్‌ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. జెర్సీ సినిమా ప్రారంభానికి ముందే ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ గౌతమ్‌కు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడట. జెర్సీని అందంగా మలిచిన తీరుకు ఫిదా అయిన నిర్మాత.. ఓ క్రేజీ కాంబోను సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట.

రామ్ చరణ్‌తో..

రామ్ చరణ్‌తో..

త్వరలోనే రామ్ చరణ్- గౌతమ్ మధ్య ఎన్వీ ప్రసాద్ ఓ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారట. ఈ సమావేశం తర్వాత ఈ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సినిమా ప్రారంభం కానుందని టాక్.

ఆర్ఆర్ఆర్‌తో ఫుల్ బిజీ..

ఆర్ఆర్ఆర్‌తో ఫుల్ బిజీ..

ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ షూటింగ్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగణ్, అలియా భట్ పాల్గొననున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్‌లు కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X