మెగా ఇంట్లో పెళ్లిళ్ల సందడి.. సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఫిక్స్!!

టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లి కళ ఉట్టిపడుతోంది. వరుసగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ఉన్న హీరోలంతా ఓ ఇంటివారు అవుతున్నారు. నిఖిల్, నితిన్, రానా వంటి వారంతా పెళ్లి చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేశారు. ఇక మెగా ఇంట్లోనూ పెళ్లిళ్ల సందడి కనబడుతోంది. ఇప్పటికే నిహారిక పెళ్లి ఫిక్స్ అయింది. ఈ క్రమంలో ఆగస్టు నెలలో గ్రాండ్‌గా నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా మెగా ఇంట్లో మరో పెళ్లికి కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

Recommended Video

Sai dharam Tej Marriage Is Expected In 2021 Summer
నితిన్ అలా తేజు ఇలా..

నితిన్ అలా తేజు ఇలా..

భీష్మ సింగిల్ ఫర్ ఎవర్ అంటూ అందర్నీ మోసం చేశాడు. భీష్మ సినిమాలో కూడా పెళ్లి చేసుకున్నాడు. ఈ సినిమా వచ్చిందో లేదో పెళ్లి చేసుకోబోతోన్నట్టు ప్రకటించాడు. సింగిల్ ఆంథమ్ అంటూ వచ్చాడో లేదో దానికి విరుద్దంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా అంతే., సోలో బతుకే సో బెటర్ అంటూనే మరో వైపు పెళ్లికి సిద్దమవుతున్నాడు.

 సోలో బతుకుకు ఎండ్ కార్డ్..

సోలో బతుకుకు ఎండ్ కార్డ్..

సినిమాల్లో సోలో బతుకు సో బెటర్ అంటున్నాడు గానీ నిజం జీవితంలో మాత్రం సింగిల్‌గా వద్దు పెళ్లే ముద్దు అంటోన్నట్టు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అయిందని ఫిలింసర్కిల్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని రోజులు ఈ వార్తలు బాగానే సర్క్యులేట్ అవుతున్నా.. ప్రస్తుతం మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

తల్లి చూసిన సంబంధం..

తల్లి చూసిన సంబంధం..

సాయి ధరమ్ తేజ్‌కు ఇప్పుడు 33 ఏళ్లు. మెగా ఫ్యామిలీలో ఇంత వరకు ఈ వయసు వచ్చే వరకు ఎవ్వరూ ఆగలేదు. అందరూ 30లోపే పెళ్లి పీఠలు ఎక్కారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు సరైన సమయంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. అందుకు సాయి ధరమ్ తేజ్ విషయంలో అతని తల్లి విజయ దుర్గ ఓ సంబంధాన్ని చూసి ఫిక్స్ చేశారట.

మెగాస్టార్ కూడా ఓకే..

మెగాస్టార్ కూడా ఓకే..

సాయి ధరమ్ తేజ్ కూడా తలూపడంతో ఈ సంబంధం గురించి చిరంజీవి వద్ద ప్రస్థావించడంతో అందరూ సుముఖత వ్యక్తం చేశారట. దీంతో గ్యాప్ లేకుండా వెంటనే పెళ్లి చేసేద్దామని కూడా నిశ్చయించుకున్నారట. కానీ సరైన ముహూర్తాలు లేనందున.. వచ్చే ఏడాది వేసవికి షిఫ్ట్ చేసినట్ట తెలుస్తోంది. మరి ఈ మేరకు వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే మన సుప్రీం హీరో స్పందించాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X