ఉదయ్ కిరణ్ బయోపిక్.. సందీప్ కిషన్ హీరో.. సోషల్ మీడియాలో హల్‌చల్

బయోపిక్ తెరకెక్కించడమనేది ఎప్పుడూ కత్తి మీద సాములాంటిదే. ఉన్నది ఉన్నట్టే తీస్తే.. కొందరికీ కోపం వస్తుంది. వాస్తవానికి దగ్గరగా తీయకపోతే విమర్శకుల దాడి పెరుగుతుంది. కల్పితాలను జోడిస్తే.. అన్ని వైపుల నుంచి ఆక్షేపణలు వస్తాయి. వివాదాస్పదమైన వ్యక్తి బయోపిక్ అంటే ఇంకా ఎక్కడ లేనీ చిక్కుముడులన్నీ ఉంటాయి. అలాంటి ఓ బయోపిక్ టాలీవుడ్‌లో రాబోతోంది.

సావిత్రి, ఎన్టీఆర్ బయోపిక్స్..

సావిత్రి, ఎన్టీఆర్ బయోపిక్స్..

ఇప్పటికే టాలీవుడ్‌లో గొప్ప నటులైన అలనాటి మహానటి సావిత్రి, ఎన్టీ రామారావు జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తెరకెక్కాయి. ఇందులో సావిత్రి జీవిత చరిత్రపై వచ్చిన మహానటి విమర్శకుల ప్రశంసలు రాగా, ఎన్టీఆర్‌పై వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు ఘోర పరాభవాన్ని చవిచూశాయి. తాజాగా తెలుగు సినీ వినీలాకాశంలో ఉదయాన వెలిగిన కిరణం.. ఉదయ్ కిరణ్‌పై ఓ చిత్రం రాబోతందన్న వార్తలు హల్ చల్ అవుతున్నాయి.

వరుస హిట్లతో దూసుకుపోయిన హీరో..

వరుస హిట్లతో దూసుకుపోయిన హీరో..

ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన హీరో ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు. ‘చిత్రం'తో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత ‘నువ్వు నేను', ‘మనసంతా నువ్వే' సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేశాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు ఉదయ్ కిరణ్.

కాస్త వెనుకబడ్డ హీరో..

కాస్త వెనుకబడ్డ హీరో..


నీ స్నేహం, శ్రీరామ్ లాంటి సినిమాలు ఉదయ్‌ను స్టార్ హీరోగా నిలబెట్టాయి. ఆపై మెల్లిమెల్లిగా చాన్సుల తగ్గిపోవడం మునుపటిలా విజయాలు అందుకోలేకపోవడంతో కెరీర్ డౌన్ అయింది. తనకు జీవితాచ్చిన దర్శకుడు తేజతో మధ్యలో ఔనన్నా కాదన్నా చిత్రాన్ని చేసినా ఆశించిన ఫలితాన్నివ్వలేదు.

ఫ్లాపుల మీద ఫ్లాపులు..

ఫ్లాపుల మీద ఫ్లాపులు..

వియ్యాల వారి కయ్యాలు, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, గుండె ఝల్లుమంది, జై శ్రీరామ్ లాంటి దారుణమైన సినిమాలను తీసి చేతులు కాల్చుకున్నాడు. ఇక చివరకు వ్యక్తిగత కారణాలతో కుంగిపోయిన హీరో.. ఆత్మహత్య చేసుకున్నాడు.

Recommended Video

#CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
బయోపిక్ అంటూ..

బయోపిక్ అంటూ..


గతంలో ఉదయ్ కిరణ్‌ బయోపిక్‌ను తీస్తానని తేజ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాబోయే అల్లుడు అంటూ తేజ ఆ మధ్య ఓ బయోపిక్ అనౌన్స్ చేసి ఆపేసాడు. ఇప్పుడు బ‌యోపిక్ చేసి ఏం లాభం.. అత‌డి జీవితంపై సినిమా చేసి తాను డబ్బులు సంపాదించుకోవాలా.. అన్న ఆలోచ‌న వ‌చ్చి తాను ఈ బ‌యోపిక్ చేయ‌డం లేద‌ని చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X