Just In
- 16 min ago
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. ఏకంగా రెండు ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్.!
- 1 hr ago
'సరిలేరు నీకెవ్వరు' మండే సర్ప్రైజ్.. అదరగొట్టేస్తున్న మూడో పాట
- 1 hr ago
'శివ 143' సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్.. చిన్న సినిమాకి పెద్ద ప్రోత్సాహం
- 2 hrs ago
మహేష్, బన్నీ అభిమానుల రచ్చ రచ్చ.. మొగుడు, మగాడు అంటూ ఒకరిపై ఒకరు!
Don't Miss!
- News
అవి తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా ? సీఎం జగన్ సవాల్
- Automobiles
కొత్తగా కొనుగోలు చేసిన బస్సులను తిరిగి ఇవ్వనున్న ఉత్తరాఖండ్ రవాణా శాఖ
- Sports
ICC Test rankings: కోహ్లీదే అగ్రస్థానం, బాబర్ అజామ్ తొలిసారి టాప్-10లోకి!
- Technology
కొత్తగా 'క్యాప్షన్ వార్నింగ్' ఫీచర్ ను ప్రారంభించిన ఇన్స్టాగ్రామ్
- Finance
అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్స్
- Lifestyle
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
సంజయ్ దత్తో తలపడనున్న బాలయ్య.. ఇక స్క్రీన్‌పై రచ్చ రచ్చే
బోయపాటి సినిమాలో విలన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రతినాయకుడు ఎంత బలంగా, క్రూరంగా ఉంటాడో.. నాయకుడి హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుంది. అందుకే ప్రతీ సినిమాలో విలన్ల క్యారెక్టరైజేషన్‌పై దృష్టి సారిస్తూ ఉంటాడు. అలా ప్రత్యేక శ్రద్ద పెడతాడు కాబట్టే జగపతి బాబుకు మరో కొత్త లైఫ్ వచ్చింది. లెజెండ్ సినిమాతో విలన్‌గా మారిన జగ్గూ భాయ్.. సినీ కెరీర్ మారిపోయింది. బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయి ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు.

కొత్త రౌడీలను పుట్టించడంలో క్రియేటివిటీ
కొత్త విలన్లను పరిచయం చేయడంలో రాజమౌళి, బోయపాటి శ్రీనులు ముందుంటారు. విలన్లను చూపించే కోణంలో వీరిద్దరిది దాదాపు ఒకే శైలి. ఇద్దరి చిత్రాల్లోనూ విలన్ల క్రూరత్వం పరిధులు దాటుతుంది. అంతలా భయపెట్టిస్తూ.. వారిని పాపులర్ చేస్తారు ఆ దర్శకులు.

హీరోను సైతం విలన్‌గా..
ఆది పినిశెట్టిని హీరోగా చూసిన తెలుగు ప్రేక్షకులు.. విలన్ గానూ ఆకళింపు చేసుకున్నారు. సరైనోడు సినిమాలో అద్భుతమైన నటన, హావాభావాలతో విలనిజం పండించాడు. అయితే మళ్లీ ఆ రేంజ్ విలన్ క్యారెక్టర్‌ను ఆది పోషించలేకపోయాడు. తాజాగా మరోక బాలీవుడ్ సెలెబ్రిటీని పరిచయం చేసేందుకు బోయపాటి సిద్దమైనట్లు టాక్.

బాలయ్య సినిమాలో సంజయ్ దత్..
ఇప్పటికే విలన్‌గా నటించిన సంజయ్ దత్.. ప్రేక్షకులను పలుమార్లు బయపెట్టాడు. హృతిక్ రోషన్ అగ్నిపథ్ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచాడు. అయితే తెలుగు ఆడియెన్స్‌ను కూడా భయపెట్టేందుకు సంజయ్ దత్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో బోయపాటి చేసే సినిమాలో సంజయ్ దత్‌ను విలన్‌గా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కేజీఎఫ్2లో ముఖ్య పాత్రలో..
సంచలనం సృష్టించిన కేజీఎఫ్ సినిమా సీక్వెల్లో సంజయ్ దత్ అద్భుతమైన పాత్రను పోషిస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయి.. సంజయ్ దత్ పాత్రకు మంచి పేరు వస్తే.. బాలయ్య సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది. అయితే సంజయ్ దత్‌ను మన నిర్మాతలు భరించగలరా? అతడిని ఒప్పించగలరా? అన్నది చూడాలి. అంతా ఓకే అయి ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం రచ్చ రచ్చే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.బాలయ్య ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ చిత్రం చేస్తుండగా.. అది డిసెంబర్ 20న విడుదలకు సిద్దంగా ఉంది.