పవర్ స్టార్‌ను కలిసిన మెగా డైరెక్టర్.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పింక్ రీమేక్‌లో నటించబోతోన్నాడని టాక్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్, వేణు శ్రీరామ్ వంటి వారి దర్శకత్వంలో సినిమాలు చేయబోతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నేడు మరో మెగా దర్శకుడు పవన్ కళ్యాణ్‌ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

ధృవ, సైరాలతో మెగా డైరెక్టర్..
రామ్ చరణ్‌తో ధృవ సినిమాను తెరకెక్కించిన సురేందర్ రెడ్డి మెగా కాంపౌండ్ అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అటుపై చారిత్రాత్మక చిత్రమైన సైరాను తెరకెక్కించి మెగా ఫ్యామిలీలో ఒకడయ్యాడు. సైరా లాంటి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సినిమాని తెరకెక్కించిన దర్శకుడిగా ఇప్పటికే సురేందర్ రెడ్డికి ఇమేజ్ పెరిగింది.

పవన్‌ను కలవడంతో..
సైరాను అద్భుతంగా మలిచిన సురేందర్ రెడ్డి అంటే మెగా కాంపౌండ్ లో ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఈ క్రమంలో పవన్‌ను సూరీ కలవడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. పవన్ కళ్యాణ్‌తో సినిమా గురించి చర్చించేందుకే వెళ్లి ఉంటాడని సంబరపడిపోతున్నారు.

మెగా బ్యానర్‌లోనే..
సైరా సక్సెస్ తర్వాత సూరీతో సినిమా చేయాలన్న ఆసక్తిని పవన్ వ్యక్తపరిచినట్లు టాక్. పవన్ నటిస్తాను అంటే తమ సొంత బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ లోనే సినిమా తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నామని చరణ్, చిరులు ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సూరీ-పవన్ మీటింగ్‌తో.. వీరి కాంబినేషన్‌లో కొణిదెల ప్రొడక్షన్స్‌లో సినిమా రాబోతోందనే వార్తలు ఊపందుకుంటున్నాయి.
Recommended Video

పింక్ రీమేక్.. హరీష్ శంకర్..?
డిసెంబర్‌లో పింక్ రీమేక్‌ను లాయర్ సాబ్ అనే టైటిల్‌తో తెరకెక్కించబోతోన్నారని వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్నిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించనున్నారని టాక్ నడుస్తుండగా.. మధ్యలో హరీష్ శంకర్ కూడా ఎంటరయ్యాడు. ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా వచ్చేశాడు. అయితే వీరందరిలో ఎవరితో పవన్ తన సినిమాను ప్రకటిస్తాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications










