»   » పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షలు డిస్కౌంట్ ఇచ్చారా?

పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షలు డిస్కౌంట్ ఇచ్చారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో అడుగు పెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ ఆయన నిర్మాతలపై గానీ, దర్శకులపైగానీ కంప్లైంట్ చేయలేదు. అలాంటిది ‘నాన్నకు ప్రేమతో' సినిమా విడుదల ముందు రోజు ఆ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మీద ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'లో ఫిర్యాదు చేసారు. అత్తారింటికి దారేది చిత్రానికి సంబంధించి తనకు ఇవ్వాల్సి రూ. 2 కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ కంప్లైంట్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఇలా రెమ్యూనరేషన్ విషయంలో కంప్లైంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. సాధారణంగా పవన్ కళ్యాన్ ఇలా చేసే వ్యక్తి కాదు. కానీ పవన్ కళ్యాణ్ మంచి తనాన్ని నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ అలుసుగా తీసుకున్నారని టాక్. పవన్ కళ్యాణ్ కబురు పెడితే కనీసం స్పందించక పోవడం, ఫోన్ చేసినా అవాయిడ్ చేయడం లాంటివి చేసారట. అందుకే పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చి ఫిర్యాదు చేసారట.

BVSN Prasad get discount from Pawan Kalyan?

ఆ వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆ నిర్మాతపై ఫిర్యాదు చేసారు. అప్పటి వరకు ఈ ఇద్దరికి కనీసం ఫోన్లో కూడా దొరకకుండా తప్పించుకు తిరిగిన బివిఎస్ఎన్ ప్రసాద్.... ఈ కంప్లైంట్ల తో ఖంగుతున్నారు. ‘నాన్నకు ప్రేమతో' సినిమా రిలీజ్ తర్వాత మీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ క్లియర్ చేస్తానని చెప్పడంతో ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా రిలీజ్ అయింది.

‘నాన్నకు ప్రేమతో' చిత్రానికి కలెక్షన్లు బాగానే ఉన్నా... లాభాలు ఆశించిన రేంజిలో లేవు. ఇప్పటికైతే తన చేతికి వచ్చిన డబ్బుతో బివిఎస్ఎన్ ప్రసాద్ వెంటనే పవన్ కళ్యాణ్ ను సంప్రదించి బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేయడానికి వచ్చాడని.... నిర్మాత కోరిక మేరకు పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షలు డిసౌట్ ఇచ్చాడని, రూ. 1.50 కోట్లు మాత్రమే స్వీకరించారని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ కూడా నిర్మాతకు కొంత డిసౌంట్ ఇచ్చినట్లు సమాచారం.

English summary
Film Nagar source said that, BVSN approached Pawan recently to clear the dues. Apparently, Pawan gave a discount of Rs 50 lakhs and took only Rs 1.50 crores from his producer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu