Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సూరి, భాను ఖాతాలున్న బ్యాంకులోనే కళ్యాణ్ ఖాతా
హైదరాబాద్ లోని ఓ బ్యాంకులో సూరి, భాను, సినీ నిర్మాతలు సి.కళ్యాణ్, శింగనమల రమేష్‌లకు వేర్వేరుగా ఖాతాలు ఉన్నట్లు తెలుస్తోంది. సూరి కుమారుడి పేరుతో మరో ఖాతా ఉంది. ఏడాది కాలంలో ఈ ఖాతాల్లో జరిగిన లావాదేవీల వివరాలు ఇవ్వాలని బ్యాంకుకు పోలీసు అధికారులు లేఖ రాశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చినప్పటి నుంచి సూరి, భాను సెటిల్మెంట్లు మొదలుపెట్టినట్లు తెలిసింది. సూరి జైల్లో ఉన్నప్పుడు భాను హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని విలువైన భూములు, స్థలాల సమాచారం సేకరించేవాడు. వివాదాస్పద స్థలాలు, బెదిరిస్తే లొంగిపోయే స్థలయజమానుల వివరాలు తీసుకుని సూరికి చెప్పేవాడని వార్తలు వచ్చాయి.
జైలు నుంచే ఆయా స్థలాలను సొంతం చేసుకునేందుకు పథకం రచించేవారు. ఇలా 2003 నుంచి 2007 సంవత్సరం వరకు సూరి బృందం సుమారు 300 సెటిల్మెంట్లు చేసుంటుందని పోలీసులు భావిస్తున్నారు. సూరి బృందానికి ఇద్దరు నిర్మాతలు తొలి నుంచి అండగా ఉన్నారు. వీరిలో ఒకరు సూరి సొంత జిల్లా అనంతపురానికి చెందిన వారు.