నాగ్ 'పవర్' చూడనున్న సి.కళ్యాణ్

By Staff

Nagarjuna
నాగార్జున, లారెన్స్ కాంబినేషన్ లో వచ్చిన 'మాస్' హిట్టయితే 'డాన్' ఫెయిలైందన్న సంగతి తెలిసిందే. అలాగే లారెన్స్ 'పార్ధు', 'ముని' వంటి సినిమాల్లో సోలో హీరోగా చేసి దెబ్బతిన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ లో మూడో సినిమాకు శ్రీకారం చుడుతున్నారు . ఈ మథ్యనే 'చందమామ' తో హిట్టిచ్చిన సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ ప్రాజెక్టుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా డిసెంబర్ లోగానీ, 2009 జనవరిలోగాని ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోగా లారెన్స్ తమిళంలో తలపెట్టిన 'రాజాధిరాజా' సినిమా పూర్తవుతుంది. అలాగే నాగ్ 'కింగ్' కూడా విడుదలకు రెడీ అవుతుంది. అలాగే ఇన్నాళ్ళూ చిన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సి.కళ్యాణ్ ఈ సినిమాతో పెద్ద ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో చేరుతాడంటున్నారు. ప్రస్తుతం ఆయన 'ఆర్య ఎమ్.బి.బి.యస్' అనే తమిళ సినిమాను అదే పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి 'పవర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. బెస్టాఫ్ లక్ సి.కళ్యాణ్!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X