twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ :‘ఇద్దరమ్మాయిలతో' కులాల గోల

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం మొన్న శుక్రవారం(మే 31)న గ్రాండ్‌గా విడుదలయిన సంగతి తెలిసిందే. చిత్రం మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కులాల మీద చెప్పిన డైలాగులు చర్చనీయాంసంగా మారాయి. ఈ డైలాగులు హైలెట్ గా నిలిచి సినిమాని నిలబెడతాయని చాలా మంది అంచనాలు వేసారు.

    నిజానికి ఇటీవల కాలంలో ఏ తెలుగుసినిమా లోనూ కనిపించిని కాస్ట్ పీలింగ్ ఈ చిత్రంలో వ్యక్తమయ్యింది. డైలాగ్స్ తో ఆకట్టుకునే పూరీ జగన్నాధ్ ఈ సారి కలాన్ని కులం సిరాలో కలిపి రాసారు. హీరో,హీరోయిన్ల పెళ్లి మాటల సందర్భంలోనూ, వారి ప్రేమ సన్నివేశాల్లోనూ కులాల గోల మరీ ఎక్కువైంది. తన భార్య ఎలాగూ స్నేహా రెడ్డి కాబట్టి.. ఇలా పెట్టించాడా....సరదాకోసం చేసాడా అన్నది చర్చనీయాంసంగా మారింది.

    బ్రాహ్మణ,రెడ్డి,కాపు కులాలను ఈ సినిమాలో ఎక్కువగా ప్రస్దావించాడు. అంతేకాదు కన్వర్టడ్ గురించీ ప్రస్తావించారు. ఇంతకీ ఈ కులాల ప్రసక్తి సినిమాలో రావటానికి బన్నీ కారణమనే వాదన బయిట వినపడుతోంది. సినిమాల్లో రెడ్లను చెడ్డగా చిత్రీకరిస్తున్నారని, వాళ్లలో చదువుకున్న మేధావులున్నారని చెప్పటంతో ఆగకుండా,కేథరిన్ తో పదే పదే రెడ్డి అని పిలించుకున్నాడు.

    కాపు అబ్బాయికి రెడ్డి అమ్మాయితో పెళ్లి అయ్యిందని, రెడ్డి అబ్బాయి...కాపుల అమ్మాయి పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారనే మాటలు సినిమాలో వినపించారు. స్నేహరెడ్డిని చేసుకున్న ప్రబావమో లేక రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించే ఉద్దేశ్యమా అంటున్నారు. ఏదైమైనా సినిమా ఎలా ఉన్నా ఈ కులాల డైలాగులు గురించే బయిట మాట్లాడుకుంటున్నారు.

    English summary
    Puri has once again shown his affection for Reddys in Iddarammayilatho movie. Besides to that there is a lengthy dialogue on caste feeling.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X