Don't Miss!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్‌ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్‌లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘డియర్ కామ్రేడ్’లో కాస్టింగ్ కౌచ్.. అవకాశం కోసం వెళ్తే రష్మికను బాగా.. బయటకొచ్చిన షాకింగ్ న్యూస్
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అవుతోంది.
సినిమా గురించి విజయ్ ఏం చెప్పాడంటే..
‘డియర్ కామ్రేడ్' గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘భావోద్వేగ ప్రధానంగా సాగే సినిమా ఇది. థియేటర్లలోనే మర్చిపోయే సినిమా కాదు. ఇందులోని ఎమోషన్స్, ఆలోచనలు మనతో పాటు చాలా కాలం ప్రయాణిస్తాయి, బాబీ, లిల్లీ అనే ఓజంట ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా సినిమా ఉంటుంది'' అని చెప్పుకొచ్చాడు.
అసలు కథ ఇదేనట
ఇందులో బాబీ అనే విద్యార్థి నాయకుడిగా విజయ్ దేవరకొండ కనిపిస్తాడట. మనసుకు నచ్చినవి, తనకు కరెక్ట్ అనిపించిన వాటి కోసం పోరాడే దూకుడు మనస్తత్వమున్న యువకుడిగా ఉంటాడని తెలిసింది. అతడి జీవితంలోకి లిల్లీ అనే మహిళా క్రికెటర్ రాకతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. భిన్న జీవన నేపథ్యాలు కలిగిన వారి అనుబంధంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయన్నదే ఈ చిత్ర ఇతివృత్తం అని సమాచారం.
రాజమౌళి ప్రయత్నాలు విఫలం.. విజయ్ దేవరకొండ మాత్రం సక్సెస్.. రాఖీ భాయ్ మహిమే కారణం
కాస్టింగ్ కౌచ్
‘డియర్ కామ్రేడ్'లో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావించారని తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక లిల్లీ అనే మహిళా క్రికెటర్‌గా కనిపిస్తుంది. ఆమె నేషనల్ క్రికెటర్ అయ్యే సమయంలో కొందరు పెద్దలు అవకాశం కావాలంటే తమను సంతృప్తి పరచాలని అడుగుతారట. ఆ సమయంలో ఆమెను బాగా ఇబ్బంది పెడతారట. అప్పుడు రష్మిక పాత్ర ఎలా రియాక్ట్ అయింది? తన కెరీర్ ఏమైంది? అనేదే చిత్ర కథ అని సమాచారం.
మెసేజ్ ఉంటుందని చెప్పేశారు
వాస్తవానికి ఈ సినిమా మెసేజ్ ఓరియెంటెడ్ అని చిత్ర యూనిట్ ముందే తెలిపింది. ఇటీవల విజయ్ దేవరకొండ కూడా ‘సమాజం గురించి పట్టించుకోకుండా నచ్చినదాని కోసం పోరాడాలనే చక్కటి సందేశంతో కూడిన ఇతివృత్తమిది. ఆ సందేశం నచ్చే ఈ సినిమా చేశాను. మల్టీజోనర్స్లో కథ సాగుతుంది' అని వివరించాడు.
‘అర్జున్ రెడ్డి' సెంటిమెంట్
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. అంతేకాదు, ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 49 నిమిషాలు ఉంది. గతంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి' కూడా దాదాపు మూడు గంటల రన్ టైమ్ ఉంది. లాంగ్ రన్ టైమ్ ఉన్నప్పటికీ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్' కూడా అలాంటి మేజిక్‌నే క్రియేట్ చేస్తుందేమోనన్న టాక్ వినిపిస్తోంది.