»   » చిరంజీవి కూతురుతో పెట్టుకుంటే అంతే, రామ్ చరణ్ వేరు కుంపటి?

చిరంజీవి కూతురుతో పెట్టుకుంటే అంతే, రామ్ చరణ్ వేరు కుంపటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెం.150' శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమా కోసం తన కెరీర్లో ఎప్పుడూ లేనంతగా శ్రమిస్తున్నారు. తన కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో చిరంజీవి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మెగా అభిమానులకు ది బెస్ట్ మూవీ అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ప్రస్తుతం చిరంజీవి-లక్ష్మీరాయ్ కాంబినేషన్లో లారెన్స్ కొరియోగ్రఫీలో స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తొలుత కేథరిన్ ను తీసుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆమెను తప్పించి లక్ష్మీరాయ్ ని ఎంపిక చేసారు.

డ్యాన్స్‌మాష్టర్‌ లారెన్స్‌ చెప్పిన మూమెంట్స్‌ సరిగా ప్రాక్టీస్‌ చేయకపోవడంతోనే జరిగిన గొడవ కారణంగానే క్యాథరిన్‌ను తీసేసారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై మరో రూమర్ తెరపైకి వచ్చింది.

చిరు కూతురుతో పెట్టుకోవడమే కారణమా?

చిరు కూతురుతో పెట్టుకోవడమే కారణమా?

అయితే కేథరిన్ ను తప్పించడానికి అసలు కారణం వేరే ఉందని, చిరంజీవి కూతురు సుష్మితతో గొడవ పడ్డ కారణంగానే ఆమెను సినిమా నుండి తప్పించారని అంటున్నారు. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ... ఈ విషయం తెలిసి అంతా షావుతున్నారు.

గొడవకు కారణం ఏమిటి?

గొడవకు కారణం ఏమిటి?

ఖైదీ నెం. 150వ సినిమాకు చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కాస్ట్యూమ్‌ డిజైర్‌. చిరంజీవికి సంబంధించిన కాస్ట్యూమ్స్ ఆమె స్వయంగా హ్యాండిల్ చేస్తున్నారట. సినిమాలో ఇతర నటుల, హీరోయిన్ల కాస్ట్యూమ్‌లను సుస్మిత సన్నిహితురాలైన మరో లేడీ హ్యాండిల్ చేస్తున్నారట. కాస్ట్యూమ్స్‌ విషయమై క్యాథరిన్‌ఆమెతో గొడవపెట్టుకుందని, సుస్మిత సర్దిచెప్పడానికి ప్రయత్నించినా క్యాథరిన్‌ వినలేదని...ఈ గొడవ పెద్దది కావడంతో ఆమెను సినిమా నుండి తప్పించే వరకు వెల్లిందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ వేరు కుంపటి

రామ్ చరణ్ వేరు కుంపటి

కాగా... రామ్ చరణ్ కొత్త పీఆర్ఓను (పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్) నియమించి... ఖైదీ నెం.150, ధృవ మూవీ విషయంలో తన ఇమేజ్ పెంచే బాధ్యతలు అప్పగించడం హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు ఈ వ్యవహాలు అల్లు అరవింద్ చూసుకుంటూ వస్తున్నారు. ఇపుడు రామ్ చరణ్ వేరు కుంపటి పెట్టడం పలు సందేహాలకు కారణం అవుతోంది.

అల్లు అరవింద్

అల్లు అరవింద్

పిఆర్ సంబంధ వ్యవహారాలు మెగా ఫ్యామిలీ హీరోలకు ఇప్పటి వరకు అల్లు అరవిందే చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రామ్ చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అల్లు అరవింద్ నియమించిన వ్యక్తులపై రామ్ చరణ్, చిరంజీవి అసంతృప్తిగా ఉండటమే ఇందుకు కారణమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేథరిన్ ను రికమండ్ చేసింది వారే

కేథరిన్ ను రికమండ్ చేసింది వారే

చిరంజీవి 150వ సినిమాకు స్పెషల్ సాంగు కోసం కేథరిన్ ను రికమండ్ చేసింది అల్లు వారే నంట. సరైనోడు సినిమాతో బన్నికి మంచి ఫ్రెండ్ అయింది కేథరిన్. అల్లు వారి నుండి రికమండేషన్ రావడంతో కేథరిన్ ను తీసుకున్నారు. కానీ ఆమె ఇలా సెట్స్ లో పెద్ద గొడవ చేసి తనను తప్పించే వరకు పరిస్థితి తెచ్చుకుంది.

సెక్సీ లుక్... అంతా చిరంజీవి కూతురు టాలెంటే!

సెక్సీ లుక్... అంతా చిరంజీవి కూతురు టాలెంటే!

సెక్సీ లుక్... అంతా చిరంజీవి కూతురు టాలెంటే! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Though heroine gets changed for many times in Chiranjeevi movie, no one will care as everyone watch the movie only for Chiranjeevi. But few are surprised why Catherine Tresa who got a chance to act in Item song in Chiru 150 movie got removed from the movie, as this situation never happened in any Chiru past movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X