సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న బోయపాటి.. సినిమాలో ఆమె ఫిక్స్.. స్టైల్ మార్చిన దర్శకుడు

బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ అంటే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాలతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన ఈ ద్వయంపై.. నందమూరి అభిమానుల్లో అంచనాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. హ్యాట్రిక్ కొట్టేందుకు మరోసారి జట్టు కట్టగా చిత్ర ప్రారంభోత్సవం రోజునే.. ఓ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పి అందరిలో జోష్ నింపాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

 హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు..

హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు..

మొన్నటి రూలర్ ఆడియో ఫంక్షన్లో బోయపాటి మాట్లాడుతూ.. హీరోయిన్ అంశం గురించి చెప్పుకొచ్చాడు. మా చిత్రానికి ఆ హీరోయిన్ ఫిక్స్ అయిందని, ఈ హీరోయిన్ ఫిక్సయిందని వినిపిస్తోందని, వాటిన నమ్మోద్దని తెలిపాడు. హీరోయిన్లను కన్ఫామ్ చేశాక తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ..

సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ..

సెంటిమెంట్లకు ప్రాధాన్యతినిచ్చే బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌తీ సినిమాకీ ముందు తాను క‌నిపించి `యాక్ష‌న్‌` చెబుతాడు. అదో ట్రేడ్ మార్క్‌గా మారింది. ఇప్పుడు ఓ క‌థానాయిక కూడా ఆ సెంటిమెంట్‌లో చేరింది. ‘స‌రైనోడు'లో క‌థానాయిక‌గా న‌టించిన క్యాథరిన్.. ‘జ‌య జాన‌కీ నాయిక‌'లో ప్రత్యేక పాటకు చిందులేసింది. అవి రెండూ హిట్ అవడంతో మరోసారి ఆమెను ఎంచుకున్నాడనటి టాక్. అయితే మొదటి హీరోయిన్ కోసం నయన్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల వరకు ట్రై చేస్తున్నాడని టాక్.

 స్టైల్ మార్చమని బాలయ్య సలహా..

స్టైల్ మార్చమని బాలయ్య సలహా..

కథానాయకుడు, మహా నాయకుడు లాంటి చిత్రాలు దారుణంగా బెడిసి కొట్టడంతో.. తాను చేయబోయే తదుపరి చిత్రాల్లో వైవిధ్యం ఉండాలని బాలయ్య కండీషన్ పెట్టినట్టు టాక్. అందుకే వివి వినాయక్ ఎన్ని కథలు చెప్పినా ఓకే చేయలేదని సమాచారం. ఈ క్రమంలో బోయపాటికి కూడా రొటీన్, ఊక దంపుడు కథలను కాకుండా కాస్త వైవిధ్యంగా ఉండేలా చూడమని సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

 డివోషనల్ టచ్..

డివోషనల్ టచ్..

ఈ నేపథ్యంలో కొత్త దనం కోసం.. డివోషనల్ టచ్ ఇవ్వనున్నాడనేది తాజా సమాచారం. ఇంతవరకూ యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన బోయపాటి, ఈ సారి గ్రామీణ నేపథ్యంలో కథ అల్లుకుని, ఆ కథలో డివోషనల్ టచ్ ఉండేలా చూసుకున్నాడని అంటున్నారు. దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X