బాలయ్యకు షాకిచ్చిన యంగ్ హీరోయిన్! ఆ మేర ఇచ్చుకుంటేనే ఓకే.. లేదంటే!!
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న కొత్త సినిమా కోసం హీరోయిన్ వేట మొదలైంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాను అతిత్వరలో సెట్స్ మీదకు తేవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు హీరోయిన్ కేథరిన్‌ని సంప్రదించారని, ఈ సినిమా కోసం ఆమెను ఫైనల్ కూడా చేశారని టాక్ నడించింది.
అయితే తాజా సమాచారం మేరకు ఆమె ఈ సినిమా చేయడం లేదని తెలుస్తోంది.
బాలయ్య సరసన నటించేందుకు గాను కేథరిన్ పారితోషికం చాలా ఎక్కువగా అడిగిందట. దీంతో ఆమెను పక్కన పెట్టేసి మరో కథానాయిక కోసం ప్రయత్నాలు చేస్తోందట బోయపాటి టీమ్. ఫిబ్రవరి 3వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న నేపథ్యంలో బాలయ్య హీరోయిన్ ఎవరనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

బాలయ్య 106వ సినిమాగా బోయపాటి దర్శకత్వంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిననున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నాడు. బాలయ్య- బోయపాటి సక్సెస్‌ఫుల్ కాంబోలో ఈ సినిమా వస్తుండటం నందమూరి అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రూలర్ సినిమాతో ఆశించిన మేర ఫలితం రాబట్టని బాలకృష్ణ.. ఈ సినిమాతో ఆ లోటు తీర్చాలని కసిగా ఉన్నారు. చూడాలి మరి విడుదలయ్యాక ఈ సినిమా ఏ రేంజ్ సునామీ సృష్టిస్తుందో!.


Click it and Unblock the Notifications











