ఎమ్మెల్యే కాస్తా ఐఏఎస్ ఆఫీసర్‌గా మార్పు! కేవలం బాలకృష్ణ కోసమే..
నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తోంది. బాలకృష్ణ కోసమే ఎమ్మెల్యే కాస్త ఐఏఎస్ ఆఫీసర్‌గా మార్పు చెందనుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? అసలు సంగతేంటి? వివరాల్లోకి పోతే..

విచిత్రం గానే ఉంటుంది కానీ..
ఎమ్మెల్యే ఐఏఎస్ ఆఫీసర్‌గా మారడమంటే నిజంగా విచిత్రం గానే ఉంటుంది మరి. కాకపోతే రియల్‌గా కాదులెండి.. రీల్ లైఫ్‌లో. బాలకృష్ణ తాజా సినిమా రూలర్ విడుదలయింది. దీంతో బాలయ్య తన ఫోకస్ అంతా నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై పెట్టనున్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కనున్న కొత్త సినిమా అతిత్వరలో సెట్స్ మీదకు రానుంది.

బాలయ్య హీరోయిన్.. నేరస్థుల భరతం పట్టే లేడీ
బాలకృష్ణ- బోయపాటి శ్రీను సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న సినిమాలో ఓ హీరోయిన్‌గా క్యాథరిన్ ట్రెసా నటించనుంది. అయితే తాజా సమాచారం మేరకు ఇందులో ఆమె క్యారెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. నేరస్థుల భరతం పట్టే లేడీ ఐఏఎస్ ఆఫీసర్ క్యాథరిన్ ట్రెసా రోల్ డిఫైన్ చేశారట బోయపాటి శ్రీను.

ఆ ఎమ్మెల్యేనే ఐఏఎస్ ఆఫీసర్..
అయితే ఇక్కడ విషయమేమంటే.. గతంలో అదే బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'సరైనోడు' సినిమాలో క్యాథరిన్ ట్రెసా ఎమ్మెల్యేగా నటించింది. మరోసారి బోయపాటి దర్శకత్వంలోనే చేయబోతున్న ఆమె ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్‌గా నటించనుంది. అంటే ఆ ఎమ్మెల్యేనే ఐఏఎస్ ఆఫీసర్‌గా మార్చేశారన్నమాట బోయపాటి.

బలమైన కథ.. బాలయ్య క్యారెక్టర్ కూడా
ఇక మరో ఆసక్తికర విషయమేమిటంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆధారం చేసుకుని బోయపాటి శ్రీను ఓ బలమైన కథను సిద్ధం చేశారట. ఇందులో బాలకృష్ణ క్యారెక్టర్ కూడా ఎంతో బలంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఇద్దరూ మాస్ పల్స్ తెలిసిన హేమాహేమీలు, పైగా బాలయ్య- బోయపాటి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ ఇది. కాబట్టి ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతోందో మనమే అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఇప్పటినుంచే ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో ఓ రేంజ్ అంచానులున్నాయి.


Click it and Unblock the Notifications











