»   » అర్థరాత్రి ఆమె ఇంటికి... రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన హీరో!

అర్థరాత్రి ఆమె ఇంటికి... రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నిర్మాత అర్బాజ్ ఖాన్(సల్మాన్ ఖాన్ సోదరుడు) ఆయన భార్య మలైకా అరోరా విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ ఇపుడు సపరేట్ గానే ఉంటున్నారు. అర్భాజ్ ఖాన్‌కు విడిపోవాలని లేకున్నా.... మలైకా మాత్రం అతనితో కాపురం చేయడానికి ఇష్ట పడలేదు. సల్మాన్ ఖాన్ కూడా ఇద్దరి కాపురం నిలబెట్టడానికి ట్రై చేసి విఫలం అయ్యాడు. ఇద్దరూ విడిపోవడానికి రకరకాల కారణాలు వినిపించాయి. అందులో మలైకాకు బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ఎఫైర్ ఉందనే కారణం కూడా ఒకటి.

నిన్న మొన్నటి వరకు ఇద్దరి మధ్య ఎఫైర్ అనేది రూమర్ గానే ఉంది. తాజాగా ఇద్దరూ అర్థరాత్రి రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోవడం హాట్ టాపిక్ అయింది. అర్జుర్ కపూర్ అర్థరాత్రి రహస్యంగా ముంబైలోని ఖర్‌లో మలైకా నివాసం ఉంటున్న ఫ్లాటుకు వచ్చాడు. వీరి వ్యవహారం బయట పెట్టేందుకు కొంత కాలంగా సీక్రెట్ గా ఫాలో అవుతున్న ఫోటోగ్రాఫర్లకు ఎట్టకేలకు ఇద్దరూ చిక్కారు.

ఈ విషయాన్ని ఓ ఫోటోగ్రాఫర్ ఇంగ్లీష్ డైలీకి తెలుపుతూ...'మేము మలైకా ఇంటి బయట ఉన్నాం. అర్థరాత్రి దాటిన తర్వాత అర్జున్ కపూర్ అక్కడికి వచ్చాడు. అతని కారు రాగానే మేము ఒక్క ఫోటో కూడా తీయలేదు. మేము ఉన్నట్లు అతనికి తెలిసిపోతే అతను వెంటనే అక్కడి నుండి వెల్లిపోతాడని మాకు తెలుసు. తొలుత అతని కారు డ్రైవర్ కిందకు దిగి ఎవరైనా ఫోటోగ్రాఫర్లు అక్కడ ఉన్నారేమో అని చెక్ చేసాడు. మేము అతనికి కనిపించలేదు. ఆ తర్వాత అర్జున్ కపూర్ లోనికి వెళ్లి పోయాడు' తెలిపారు.

'అర్జున్ అక్కడ చాలా సేపు గడిపాడు. తర్వాత కొందరు పోలీసులు అక్కడికి వచ్చి మమ్మల్ని అక్కడి నుండి వెళ్లిపోమని చెప్పాడు. అర్జున్ కాల్ చేయడం వల్లనే తాము వచ్చిట్లు పోలీసులు తెలిపారు. ఫోటోగ్రాఫర్లను అక్కడి నుండి పంపించమని అర్జున్ వారికి చెప్పాడు. పోలీసులు మకు చెప్పగానే మేము అక్కడి నుండి వెళ్లి పోయాం' అని సదరు ఫోటో గ్రాఫర్ తెలిపారు.

అర్జున్ కపూర్, మలైకాలను లింకప్ చేస్తూ చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా సంఘటనతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అర్జున్ కపూర్ ఒకప్పుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ బాయ్ ఫ్రెండ్. అయితే మలైకాతో లింకప్ పెట్టుకుని ఆమెను మోసం చేసాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అర్పిత ఆయుష్ వర్మను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చి హ్యాపీగా ఉంటోంది.

అర్జున్ -మలైకా

అర్జున్ -మలైకా

అర్జున్, మలైకా మధ్య ఎఫైర్ ఉన్నట్లు కొంతకాలంగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

విడాకులు కారణం అదేనా?

విడాకులు కారణం అదేనా?

మలైకా తన భర్తకు విడాకులు ఇవ్వడానికి కారణం ఈ ఎఫైరేనా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

పరిచయం ఎలా?

పరిచయం ఎలా?

మలైకా, అర్జున్ పలు టీవీ షోలలో కలిసి పార్టిసిపేట్ చేసారు. అలా ఇద్దరి హధ్య పరిచయం ఏర్పడిందట.

క్లోజ్ గా మూవ్

క్లోజ్ గా మూవ్

ఇద్దరూ పలు సందర్భాల్లో క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి ఆకర్షణ ఏర్పడిందని టాక్.

పార్టీల్లో..

పార్టీల్లో..

పలు సెలబ్రిటీ పార్టీల్లో కూడా ఇద్దరూ కలసి పాల్గొన్నారు.

మౌనం

మౌనం

ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నా ఇద్దరూ మౌనంగానే ఉంటున్నారు. మౌనంగా ఉన్నారంటే ఎంతో కొంత వాస్తవం ఉన్నట్లేగా?

English summary
We all know things are not fine between Arbaaz Khan and Malaika Arora Khan and they both are living separately. And guess who visits Malaika secretly in her flat? It's none other than Arjun Kapoor. As per reports in a leading daily, Arjun visited her house in Khar where she currently lives with her son Arhaan, after leaving Arbaaz's home.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu