విజయ్ దేవరకొండ 'నోటా'కు షాక్.. ఆ సన్నివేశాలు తొలగించాల్సిందే!

Recommended Video

CBFC Orders Cuts In Vijay Devarakonda's Movie NOTA

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ అక్టోబర్ 5న నోటా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే గీత గోవిందం చిత్రంతో తిరుగులేని హిట్ సొంతం చేసుకున్న విజయ్ ఈ సారి పొలిటికల్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. విజయ్ నటించిన నోటా చిత్రం శుక్రవారం విడుదలవుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉండగా విడుదలకు రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఈ చిత్రం సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ అన్నట్లుగానే

విజయ్ దేవరకొండ అన్నట్లుగానే

ఇటీవల ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నా చిత్రాలు ఎప్పుడూ సాఫీగా విడుదల కావు. ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది అని విజయ్ దేవరకొండ తెలిపాడు. నోటా చిత్రం రాజకీయ అంశాలతో రూపొందింది. దీనితో ఈ చిత్రంపై కొన్ని రాజకీయ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలపై ప్రభావం

ఎన్నికలపై ప్రభావం

ఈ చిత్ర టైటిల్ నోటా. తెలంగాణాలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నోటా టైటిల్ ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు వివాదం సృస్టిస్తునట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. ఈ చిత్రంలో వివాదభరిత అంశాలు ఏమీ లేవని తెలియజేశాడు.

తొలగించాల్సిందే

తొలగించాల్సిందే

నోటా చిత్రానికి సెన్సార్ నుంచి కూడా చిక్కులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కొన్ని వివాదభరిత సన్నివేశాలు, డైలాగులని సెన్సార్ సభ్యులు గుర్తించారని ప్రచారం జరుగుతోంది. ఆ సన్నివేశాల్ని తొలగించి, డైలాగులని మ్యూట్ చేయాలని ఆదేశించారట.

కాంట్రవర్సీగా

కాంట్రవర్సీగా


ఆ సన్నివేశాలు కాట్రవర్సీగా మారతాయని భావించిన సెన్సార్ సభ్యులు పలు కట్స్ సూచించినట్లు తెలుస్తోంది. సెన్సార్ ఆదేశాలకు అనుగుణంగా ఆయా సన్నివేశాలని తొలగించే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ముఖ్యమంత్రి పాత్రలో

ముఖ్యమంత్రి పాత్రలో


ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ యంగ్ సీఎంగా కనిపించబోతున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి ఎమోషనల్, రొమాంటిక్ ప్రేమ కథలలో నటించిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా ఎలా నటించాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది. విజయ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X