పవన్ 'పులి' హీరోయిన్ నిఖిషా పటేల్ నెక్ట్స్ ఏం చేస్తుంది?
పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య కాంబినేషన్లో రూపొందుతున్న 'పులి' చిత్రం ద్వారా నిఖిషా పటేల్ అనే హీరోయిన్ పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ హీరోయిన్ మరో రెండు రోజుల్లో పాటల షూటింగ్ నిమిత్తం దుబాయి వెళ్ళనుంది. ఈమెను మీడియా కలిసి పులి చిత్రం తర్వాత ఏమన్నా కమిటయ్యారా అని అడిగింది. దానికి ఆమె పజిల్ అయిపోయినట్లు ఫేస్ పెట్టింది. ఇప్పటివరకూ నెక్ట్స్ గురించి ఏమీ ఆలోచించలేదంది. అలాగే ఓ హిందీ చిత్రం స్క్రిప్టు వింటున్నాను. అన్నీ కలిసి వస్తే అది ఫైనలైజ్ కావచ్చు అంది. అందులో హీరో ఎవరూ అంటే..ఇంకా స్క్రిప్టు ఫైనలైజ్ కాలేదు...అప్పుడే ఎలా ఫిక్సవుతాం అంది. అయినా నా ఆలోచన అంతా క్రిస్ మస్ మీదే ఉంది. ఆ ఫెస్టివల్ మా కుటుంబంలో అంతా కలిపి జరుపుకునేది. అందరం ఒక చోట చేరుతాం. అందుకోసం ఓ గిప్ట్ కొనాలి. ఏం కొంటే మావాళ్లు ఎక్కువ హ్యాపీ ఫీలవుతారు అనేది ధింక్ చేస్తున్నా అంది. అలాగే షూటింగ్ గ్యాప్ లోగానీ, హోటల్ రూమ్ లో గానీ నేను ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. చక్కగా ఏ టీవీనో చూస్తాను..లేదా మంచి పుస్తకం దొరికితే తల ఎత్తకుండా చదివేస్తాను. ఏదీ లేకపోతే సెల్ ఫోన్..ప్రెండ్స్ తో మాట్లాడటం..పోట్లాడటం అంది. పులి అనంతరం ఆమె బాగా బిజీ అవుతానని భావిస్తోంది. అందుకోసమే ఏ ప్రాజెక్టు మీదా సంతకం పెట్టడం లేదని తెలుస్తోంది. డిమాండ్ వచ్చాక ఆచితూచి వ్యవహిద్దామనే ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











