»   » త్వరలో పెళ్శకి సిద్దం అంటున్న బాలీవుడ్ సెక్స్ బాంబ్

త్వరలో పెళ్శకి సిద్దం అంటున్న బాలీవుడ్ సెక్స్ బాంబ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ లో సెలీనా జైట్లీ రూటు సపరేటు. మొన్నా ఆమద్య 'స్వలింగ సంపర్కులు కూడా మనుషులే. వారికీ సమాజంలో జీవించే హక్కు వుంటుంది. స్వలింగ సంపర్కం తప్పుకాదు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బాలీవుడ్ సెక్సీతార సెలేనా జైట్లీ. అయితే ఈ తార ఇప్పుడు తన పెళ్ళి వార్తతో మరోసారి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. గత సంవత్సరకాలంగా ఆమె డేటింగ్ చేస్తున్న వ్యక్తినే పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్ తో చాలా కాలంగా సెలీనా ప్రయాణం నడుపుతున్నారట.

ఈ పెళ్ళి విషయంపైనే సెలీనాను ప్రశ్నిస్తే 'మా మధ్య ప్రేమాయణం కాస్తా ముదిరి గత సంవత్సర కాలంగా డేటింగ్ రూపంలోకి మారింది. అయితే పెళ్ళి విషయమై ఇప్పుడు ఏమి చెప్పలేను. కాకపోతే త్వరలోనే ఇద్దరం పెళ్ళిపీటలేక్కే అవకాశాలు మాత్రం వున్నాయి. ఇందుకు మా ఇరు కుటుంబాల పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. అంతే కాదు స్వలింగ సంపర్కులు కోసం తను చేస్తున్న ఉద్యమం పట్ల తనకు కాబోయే భర్త చాలా పోజిటివ్ స్పందిస్తున్నాడని, ఆ పోరాటమే తమ ఇద్దర్నీ కలిపిందని సెలీనా చాలా సగర్వంగా చెప్పుకుంటున్నారు. సెలీనా జైట్లీ తెలుగు లో మంచు విష్ణు వర్దన్ బాబు సరసన సూర్యం అనే సినిమాలో నటించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu