ఆర్య-2 పై సెన్సార్ బోర్డు ఛీఫ్ స్పెషల్ ఇంట్రస్టు ఏంటో
అల్లు అర్జున్,కాజల్,నవదీప్ కాంబినేషన్ లో సుకుమార్ రూపొందించిన ఆర్య-2 చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ ఛీఫ్ ఎగ్జామినింగ్ ఆఫీసర్ టి.వి.కె రెడ్డి తన ఇంటి వద్ద ప్రత్యేక షో వేయించుకుని వీక్షించారని సమాచారం. సాధారణంగా ఎపిఎఫ్ డి సి ప్రివ్యూ ధియోటర్స్ లో మిగతా సెన్సార్ బోర్డ్ మెంబర్స్ తో కలసి చిత్రాలు చూస్తూడంటం ఆనవాయితి. కానీ శుక్రవారం(19వతేది)ఈ చిత్రం ఆయన తన ఇంటి వద్ద చూడటంపై ఫిల్మ్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. చాలా పెద్ద సినిమాలు సెన్సార్ బారి నుండి తప్పించుకునేందుకు ఆ మెంబర్స్ ని ఛీప్ ని మంచి చేసుకోవటం కొత్త కాదని, అయితే ఇలా ఇంటికెళ్ళి మరీ సినిమా చూపటం వింతే అంటున్నారు. ఇక డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు ఆయన అభిప్రాయం అడగటానికే ఈ చిత్రం ఆయన ఇంటి వద్ద వేసారని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ఆయన చూసాకే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అంతటా చర్చ జరుగుతోంది. టీవీకె రెడ్డి ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని చూడాల్సిన అవసరం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











