'కెమెరామేన్ గంగతో..' హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంత?

By Srikanya

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ హీరోగా,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొంది ఈ రోజు విడుదల అవుతున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ భారీగా పలికాయని సమాచారం. రెండున్నర కోట్లకు ఈ రైట్స్ అమ్ముడు పోయాయని,ఇది తెలుగు మార్కెట్ కి రికార్డే నని తెలుస్తోంది. హిందీ మార్కెట్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి డబ్బులు సంపాదించటం కన్నా శాటిలైట్ రైట్స్ కు ఎక్కువ వస్తాయని అందుకే ఈ రేంజిలో ఆఫర్ చేసారని ముంబై వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఇప్పుడు సౌత్ సినిమాల డబ్బింగ్ సినిమాలుకు హిందీ టీవీ ఛానెల్స్ లో మంచి టీఆర్పీలు వస్తున్నాయి. దానికి తోడు సౌత్ సినిమాలు రీమేక్ లకు సైతం హిందీలో డిమాండ్ పెరగటంతో ఈ రేంజిలో రేట్లు వస్తున్నాయి. దానికి తోడు తమన్నా సైతం హిందీలో ఇప్పుడు హిమ్మత్ వాలా రీమేక్ తో క్రేజ్ తెచ్చుకుంది. పూరీ జగన్నాధ్ కూడా అమితాబ్ చిత్రం చేయటంతో అక్కడ ప్రేక్షకులకు సుపరిచితుడే కావటం కూడా ప్లస్ అయ్యింది.

దాదాపు 12 సంవత్సరాల క్రితం వచ్చిన క్రేజీ కాంబినేషన్‌ పవన్‌కళ్యాణ్‌, పూరిజగన్నాధ్‌లది. నాటి 'బద్రి' చిత్రం ఎంతటి సెన్సేషన్‌ సృష్టించిందో విదితమే. మళ్లీ ఎప్పుడెప్పుడా ఆ కాంబినేషన్‌ అని ఎదురుచూసిన అభిమానులకు 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చిత్రం ద్వారా కనువిందు చేయనుందీ కాంబినేషన్ . సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్‌ మీడియా బ్యానర్‌ పై నిర్మించారు.

నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. 'పవన్‌కళ్యాణ్‌ ఓ పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. మంచి పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో పూరి జగన్నాధ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిమానులు అంతా మెచ్చేవిధంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌ హైలెైట్‌గా ఉండబోతున్నాయి అన్నారు. అలాగే పూరి జగన్నాధ్‌ ప్రత్యేకంగా పవన్‌ కోసం రాసిన డెైలాగ్స్‌కు థియేటర్లో చప్పట్లు మార్మోగుతాయి. ఏకధాటిగా సింగిల్‌ షెడ్యూల్‌లో ఇంతటి భారీ చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్రధాన కారణం పవన్‌కళ్యాణ్‌, పూరిల సహకారం. మా బ్యానర్‌లో పవన్‌కి బిగ్గెస్ట్‌ హిట్‌ రాబోతున్నందుకు సంతోషంగా ఉంది' అన్నారు.

పూరి జగన్నాధ్‌ మాట్లాడుతూ 'బద్రితో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన పవన్‌కళ్యాణ్‌తో మళ్లీ ఇన్నేళ్లకు సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇది కచ్చితంగా పవన్‌కళ్యాణ్‌నుంచి ఎలాంటి సినిమా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారో అలాంటి పవర్‌ఫుల్‌ సినిమా ఇది. పవన్‌ కెరీర్‌లోనే ఓ ల్యాండ్‌మార్క్‌ ఫిలిం అవుతుంది. ఇందులో ఓ సరికొత్త పవన్‌ కళ్యాణ్‌ను చూస్తారు' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X