For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ ‘... రాంబాబు' టీజర్ లో ఈ డైలాగ్

  By Srikanya
  |

  హైదరాబాద్: పవన్‌ కల్యాణ్‌ హీరోగా, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరో రెండు పవర్ ఫుల్ ట్రైలర్స్ విడుదల చేయనున్నారు. ఈ సారి డైలాగ్ టీజర్ వదలనున్నారని తెలుస్తోంది. ఆ టీజర్ లో...

  "నేను పిక్చర్ లోకి వస్తే అపోజిషన్ ప్యాక్ అప్" అని పవన్ చెప్పే డైలాగు ఉండబోతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రాగా... త్వరలో విడుదల కాబోయే డైలాగ్ టీజర్ ట్రైలర్ తో సినిమా అంచనాలు ఆకాశాన్నంటుతాయని అంటున్నారు. ఇక ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ 26న (అంటే ఈ రోజు) విడుదల కానుంది.

  అత్యధిక ప్రింట్స్ తో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలియచేసారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం వచ్చిన క్రేజీ కాంబినేషన్‌ పవన్‌కళ్యాణ్‌, పూరిజగన్నాధ్‌లది. నాటి 'బద్రి' చిత్రం ఎంతటి సెన్సేషన్‌ సృష్టించిందో విదితమే. మళ్లీ ఎప్పుడెప్పుడా ఆ కాంబినేషన్‌ అని ఎదురుచూసిన అభిమానులకు 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చిత్రం ద్వారా కనువిందు చేయనుందీ కాంబినేషన్ . సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్‌ మీడియా బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు.

  నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. 'పవన్‌కళ్యాణ్‌ ఓ పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. మంచి పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో పూరి జగన్నాధ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిమానులు అంతా మెచ్చేవిధంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌ హైలెైట్‌గా ఉండబోతున్నాయి అన్నారు.

  అలాగే పూరి జగన్నాధ్‌ ప్రత్యేకంగా పవన్‌ కోసం రాసిన డెైలాగ్స్‌కు థియేటర్లో చప్పట్లు మార్మోగుతాయి. ఏకధాటిగా సింగిల్‌ షెడ్యూల్‌లో ఇంతటి భారీ చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్రధాన కారణం పవన్‌కళ్యాణ్‌, పూరిల సహకారం. మా బ్యానర్‌లో పవన్‌కి బిగ్గెస్ట్‌ హిట్‌ రాబోతున్నందుకు సంతోషంగా ఉంది' అన్నారు. పూరి జగన్నాధ్‌ మాట్లాడుతూ 'బద్రితో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన పవన్‌కళ్యాణ్‌తో మళ్లీ ఇన్నేళ్లకు సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇది కచ్చితంగా పవన్‌కళ్యాణ్‌నుంచి ఎలాంటి సినిమా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారో అలాంటి పవర్‌ఫుల్‌ సినిమా ఇది. పవన్‌ కెరీర్‌లోనే ఓ ల్యాండ్‌మార్క్‌ ఫిలిం అవుతుంది. ఇందులో ఓ సరికొత్త పవన్‌ కళ్యాణ్‌ను చూస్తారు' అన్నారు.

  హీరోయిన్‌ తమన్నా మాట్లాడుతూ 'పవన్‌తో తొలిసారి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పైగా లీడ్‌ క్యారెక్టర్‌ గంగ నాకు ఎంతో బాగా నచ్చి చేస్తున్న చిత్రం' అన్నారు. ప్రకాష్‌రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

  English summary
  Pawan Kalyan and Tamanna’s duet song Nee nagumome extraordinary’ song was shown in ‘Cameraman Gangatho Rambabu’ teaser and is receiving tremendous response among pawan kalyan’s fans. The makers, however, decided to keep the momentum steadily on this project and are going to release the next trailer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X