లేడీ డైరెక్టర్ కి హ్యాండిచ్చిన చైతన్య-సమంత.. అసలు విషయం ఏంటంటే?

సమంత, నాగచైతన్య దర్శకురాలు నందిని రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఏం జరిగింది? వీరు నందిని రెడ్డికి హ్యాండ్ ఇవ్వడం ఏమిటి? అని అనుకుంటున్నారా? అయితే చదవండి.

ట్విస్ట్‌

ట్విస్ట్‌

వాస్తవానికి, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఆమె ప్రస్తుతం చేస్తున్న చిత్రాన్ని ముగించిన తర్వాత సమంత లేదా నాగ చైతన్యతో ఒక సినిమా చేయాల్సి ఉందని రెండు రోజుల క్రితం ఒక వార్త బయటకు వచ్చింది. ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తూ ఉండగా మాళవిక మీనన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్‌ ఉంది.

వీరిద్దరి కాంబోలో

వీరిద్దరి కాంబోలో


అదేంటంటే మజిలీ సూపర్ హిట్ అయిన తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా చేయాలనీ నందిని రెడ్డి అనుకున్నారు. ఆ తరువాత ఆమె ఓ బేబీ చేసారు. ఈ ఇద్దరితో సినిమా చేసే అవకాశం దక్కలేదు. అయితే ఇప్పుడు విడాకుల తర్వాత సమంతకు బాలీవుడ్ డెబ్యూ సహా తెలుగులో అనేక పెద్ద సినిమాలు ఉన్నాయి. సినిమాలతో సహా కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, కాబట్టి ఆమె ప్రస్తుతం నందిని చిత్రాన్ని టేకప్ చేయలేదని చెప్పాలి.

రెండేళ్ల పాటు

రెండేళ్ల పాటు

ఈ క్రమంలో చైతన్య అయినా నందిని రెడ్డితో సినిమా చేస్తాడని చాలా మంది ఊహించారు. అయితే ఆయన మొదట థాంక్యూ మూవీని, ఆపై అమెజాన్ ప్రైమ్ కోసం హర్రర్ వెబ్ సిరీస్‌ను పూర్తి చేస్తానని ఇంతలో సర్కారు వారి పాట తర్వాత పరశురామ్ తదుపరి సెట్స్‌లో జాయిన్ అవుతానని తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. అంటే వచ్చే రెండేళ్ల పాటు నందిని రెడ్డి సినిమా కోసం చైతన్య ఎలాంటి డేట్స్ కేటాయించడు.

వారిద్దరిని కలిపి

వారిద్దరిని కలిపి

అలా మాజీ జంట సమంత మరియు చైతన్య ఇద్దరూ నందిని రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. నిజానికి నందిని రెడ్డి నిజానికి వారిద్దరిని కలిపి డైరెక్ట్ చేయాలనుకుంది. అది ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు, ఒక్కొరితో అయినా సినిమా చేయాలనుకుంది కానీ ఇప్పుడు అదేమీ వర్కౌట్ అయ్యేట్టు కనిపించడం లేదు.

ఇద్దరూ విడిపోవడమే మంచిదని

ఇద్దరూ విడిపోవడమే మంచిదని

ఎట్టకేలకు నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో సమంత తో విడాకుల విషయం గురించి చైతన్యకి ఎదురైంది. అయితే చైతన్య మాత్రం పెద్దమనిషి తరహాలో ఆ ప్రశ్నకు కోపంగానీ, ఇబ్బందిగానీ కలగకుండా సంతోషంగా సమాధానమిచ్చాడు. తమ మధ్య పరిస్థితులు బాగా లేకపోతే ఇద్దరూ విడిపోవడమే మంచిదని చైతన్య అన్నారు. విడిపోయి హ్యాపీగా ఉన్నామని చైతన్య చెప్పుకొచ్చారు.

కేసు కూడా

కేసు కూడా

చైతన్య తన విడాకుల గురించి మాట్లాడిన ఈ క్లిప్ వైరల్ అయినప్పటి నుండి, మీడియా మరియు అభిమానులు అతను మొత్తం పరిస్థితిని చాలా పరిపక్వతతో నిర్వహించిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. కానీ మరోవైపు, సమంతను అదే ప్రశ్న అడగడంతో ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఒక్కసారి కాదు, సమంత అనేక సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసింది. ఆమె విడాకుల గురించి మాట్లాడినందుకు యూట్యూబ్ ఛానెల్‌స్ మీద కేసు కూడా దాఖలు చేసింది. ఇప్పుడు వీరిద్దరిని పోలుస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X