నిహారికపై చైతన్య తండ్రి షాకింగ్ కామెంట్స్.. క్లబ్బులు పబ్బులు తిరిగేదంటూ!
సినీ రంగంలో ప్రేమలు,పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం అయిన విషయం తెలిసిందే. ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన అంశం మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకులు. 2020 సంవత్సరంలో చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న నిహారిక ఈ ఏడాది అతనితో డివోర్స్ తీసుకుంది. దీనికి సంబంధించిన పేపర్స్ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే నిహారిక-చైతన్య విడిపోవడానికి గల కారణాలు ప్రస్తుతం ఆసక్తిగా మారాయి. ఈ నేపథ్యంలో నిహారికపై చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆయన ఏం మాట్లాడారనే విషయంలోకి వెళితే..
డెస్టినేషన్ వెడ్డింగ్:సినీ ఇండస్ట్రీలో అత్యున్నతమైన కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. మెగా డాటర్ కు పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల 2020లో చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగింది. ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా వీళ్ల పెళ్లి జరిగింది. దీనికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది.

విడాకుల న్యూస్:మ్యారేజ్ చేసుకున్న తర్వాత నిహారిక, చైతన్య ఎంతో సంతోషంగా గడిపిటన్లు వారు పోస్ట్ చేసిన ఫొటోల ద్వారా అర్థమైంది. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. కానీ తర్వాత కొంతకాలానికి అనూహ్యంగా వారి పెళ్లి ఫొటోలు, కలిసిన క్షణాలు సోషల్ మీడియా నుంచు డిలీట్ అయ్యాయి. దీంతో వీళ్లు డివోర్స్ తీసుకుంటున్నట్లు తెగ వార్తలు వచ్చాయి.

రాకపోవడంతో:నిహారిక ఇన్ స్టా ఖాతాలో చైతన్య ఫొటోలు డిలీట్ తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్ కు చైతన్య రాకపోడవంతో ఈ డివోర్స్ మ్యాటర్ మరింత బలపడింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగెజ్ మెంట్ కి, రామ్ చరణ్ కూతురు నామకరణానికి చైతన్య రాకపోవడంపై నెట్టింట్లో తెగ చర్చ జరిగిన విషయం తెలిసిందే.

సన్నిహితులతో:ఇక జూలై 4న నిహారిక-చైతన్య తమ వివాహబంధానికి ముగింపు పలికినట్లు అధికారికంగా వెల్లడించారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు నిహారిక కొణిదెల సైతం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. అయితే వాళ్లు విడిపోవడానికి గల కారణాలపై అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో నిహారికపై చైతన్య తండ్రి ప్రభాకర్ రావు తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారట. మరి ఆ మాటల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియలేదు కానీ, ఆ కామెంట్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రేమ లేదు:"నేను ఉద్యోగరిత్యా గౌరవప్రదమైన హోదాలో ఉన్నాను. ఇంట్లో పెద్దవాళ్లతో నిహారిక ఒక్కరోజు కూడా గౌరవం చూపించలేదు. అసలు భర్తతో కలిసి జీవించాలనే ఆలోచనే తనకు లేదు. తన భర్తపై ఎప్పుడూ ప్రేమ చూపించేది కాదు. ఎప్పుడూ చూసిన క్లబ్బులు, పబ్బులు అంటూ తిరగడమే తప్ప కుటుంబం గురించి ఒక్క క్షణం ఆలోచించిందిలేదు. ఇప్పుడు మెగా అభిమానులు నా కొడుకు గురించి చెడ్డగా ప్రచారం చేయడం భరించలేకపోతున్నా" అని ప్రభాకర్ రావు అన్నారట.


Click it and Unblock the Notifications











