twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చలపతి ఎఫెక్ట్: రారండోయ్ నుంచి ఆ డైలాగ్ అవుట్? నాగ్ సీరియస్ డిసిషన్!

    సీనియర్ నటుడు చలపతిరావు వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలోని అమ్మాయిలు హానికరం అనే డైలాగ్స్ తొలగించాలని నిర్ణయం తీసుకొన్నట్టు సినీ వర్గాల్లో ఓ రూమర్ ప్రచారం జరుగుతున్నది.

    By Rajababu
    |

    సీనియర్ నటుడు చలపతిరావు వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలోని అమ్మాయిలు హానికరం అనే డైలాగ్స్ తొలగించాలని నిర్ణయం తీసుకొన్నట్టు సినీ వర్గాల్లో ఓ రూమర్ ప్రచారం జరుగుతున్నది. మహిళలు పక్కలోకే పనికి వస్తారు అని చలపతి చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం లేపుతున్న కారణంగా ఆ డైలాగ్స్ ప్రతికూలంగా మారుతుందా అనే విషయంపై చిత్ర యూనిట్ దృష్టిపెట్టినట్టు సమాచారం. మే 26న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    రారండోయ్ వేడుకలోనే..

    రారండోయ్ వేడుకలోనే..

    మహిళలను ఉద్దేశించి చలపతిరావు వ్యాఖ్యలను ఏ మాత్రం నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది. స్వదస్తూరితో తన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిన చలపతిరావుపై మహిళా సంఘాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దాంతో చలపతి వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ వివాదం అక్కినేని నాగార్జున నిర్మించిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో చోటుచేసుకొన్నది కాబట్టి దాని ఎఫెక్ట్ సినిమాపై పడుతుందా అనే కోణంలో చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

    అనూహ్య స్పందన..

    అనూహ్య స్పందన..

    నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ చిత్ర టైలర్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఆ ట్రైలర్‌లో చైతూ చెప్పిన ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం' అనే డైలాగ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అదే డైలాగ్‌ను తీసుకొని ఆడియో జరుపడం, ఆ డైలాగ్‌పై స్పందిస్తూ చలపతిరావు నోటి దురుసును ప్రదర్శించడం, దానికి యాంకర్ రవి కవరింగ్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అలాంటి డైలాగ్‌ చిత్రంలో ఉంటే సమస్యలు వస్తాయా అనే విషయంపై నాగ్ పలువురితో చర్చించినట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త ప్రచారంలో ఉంది.

    పాజిటివ్ నుంచి నెగిటివ్‌లోకి..

    పాజిటివ్ నుంచి నెగిటివ్‌లోకి..

    ఆడియో వేడుకలో రారండోయ్ వేడుక చూద్దాం హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్‌ను నాగార్జున వ్యక్తం చేశాడు. వివాదం నేపథ్యంలో పాజిటివ్‌గా ఉన్న డైలాగ్ ఒక్కసారిగా నెగిటివ్ మోడ్‌లోకి మారిపోవడంపై నాగ్ దానిపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. ఆ డైలాగ్ తీసేసి విడుదల చేస్తే బాగుంటుందని నాగ్ చాలా వ్యూహాత్మకంగా ఆలోచ‌న‌లు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటికే ఓవర్సీస్ ప్రింట్లు, అన్ని ప్రింట్లు వెళ్లిపోయాయి అని చెప్పాడు. ఒకవేళ డైలాగ్ తీసేస్తే మళ్లీ కొత్త ప్రింట్లను పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా ఇప్పటికిప్పుడు సాధ్యమేనా అనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు.

    తొలగిస్తారా.. అయితే రెండే రోజులు..

    తొలగిస్తారా.. అయితే రెండే రోజులు..

    రారండోయ్ సినిమాకు విడుదలకు మరో రెండు రోజులే మిగిలి ఉన్నది. అప్పటికి ఈ వివాదం ఓ కొలిక్కి రావొచ్చు. ఒకవేళ ఆ సినిమా చూసి ఆ డైలాగ్‌పై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ డైలాగ్‌ సినిమాలో లేకపోతే బాగుంటుందని నాగ్ అనుకుంటున్నాడట. ఈ సినిమాకు నాగార్జున నిర్మాత కాబట్టి ఆ డైలాగ్‌ విషయంలో తుది నిర్ణయం నాగార్జునదే. నిజంగా నాగార్జున ఆ విధంగా ఆలోచిస్తున్నాడా లేక గాలిరాయుళ్లు సృష్టించిన వార్తలా అనే సినిమా రిలీజ్ అవుతే అసలు విషయం బయటపడటం ఖాయం.

    English summary
    Actor Chalapatirao's Derogatory comments push Actor Nagarjuna into dilemma. As a producer of Rarandoi veduka chuddam, Nag rethinking on the dailogue which leads to contraversy. The dialogue which was positive intially, now its coloured as negitive. So Nagarjuna thinking to delect the dialogue from movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X