twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘చండీ' ఖాతాలోకి కాజలా? హన్సికా?

    By Staff
    |

    టాలీవుడ్ లో హీరోయిన్ల మధ్య క్యాట్ ఫైట్ కొత్త కాదు. కాకుంటే బాలీవుడ్ తరహాలో ఇక్కడి హీరోయిన్లు తమ మధ్య ఉన్న పోటీనో, ఈర్శా వ్యవహారాన్నో పబ్లిక్ గా చెప్పడానికి ముందుకు రారు. ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ 'వరుడు' సినిమా నుంచి పార్వతి మెల్టన్ ను తప్పించడంతో హీరోయిన్ బరిలో 'క్వీన్ బీ'లు నయనతార, ఇలియానా పోటీ పడ్డారు. అయితే 'అరుంధతి' విడుదలై పెద్ద సక్సెస్ కావడంతో అనుష్క 'వరుడు' పక్కన చేరిపోయింది. తాజాగా ఓ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ కోసం టీనేజ్ బ్యూటీస్ హన్సిక మోత్వాని, కాజల్ మధ్య ఇలాంటి పోటీనే నెలకొంది. సంక్రాంతి రాజుగా పలు భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన ఎమ్మెస్ రాజు ఇప్పుడు 'అరుంధతి' లైన్స్ లోనే ఫిక్షన్ థ్రిల్లర్ గా 'చండీ' అనే చిత్రాన్ని కోడిరామకృష్ణ దర్శకత్వంలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది.

    ఈ చిత్రంకోసం తొలుత అనుష్క, నయనతార పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ గతవారం హన్సికా మోత్వాని పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు ఇకా తాను వినలేదనీ, ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాలో బిజీగా ఉన్నాననీ హన్సిక చెబుతోంది. తాజా సమాచరం ప్రకారం ఇప్పుడు హన్సిక కూడా వెనుకబాట పట్టిందనీ, 'మగధీర' సాధించిన సూపర్ డూపర్ హిట్ తో కాజల్ 'చండీ' ప్రాజెక్ట్ ను కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉందనీ తెలుస్తోంది. ఆసక్తికరంగా హన్సిక మాజీ మేనేజర్ ఇప్పుడు కాజల్ మేనేజర్ కావడంతో ఎలాగైనా కాజల్ కు ఆ ప్రాజెక్ట్ వచ్చేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. కథానాయిక పాత్ర చుట్టూ నడిచే కథాంశంతో 'చండీ' ఉంటుందనీ, ఇద్దరు బిగ్ స్టార్స్ కు స్క్రిప్టు వినిపించామనీ, అయితే ఇంకా ఎవర్నీ ఎంపిక చేయడం కానీ, అడ్వాన్ ఇవ్వడం కానీ చేయలేదనీ ఎం.ఎస్.రాజు వివరణ ఇచ్చారు. మరో వారంలో హీరోయిన్ ఫైనలైజ్ అవుతుందన్నారు. కాజల్ సైతం 'అలాంటి అవకాశం వరించి వస్తే నా కెరీర్ లోనే గ్రేట్ ఫిల్మ్ గా భావిస్తాను' అంటూ తెలివిగా సమాధానమిస్తోంది. ఈ ఇద్దరి ముద్దుగుమ్మల్లో ఎవరు 'చండీ' గా మారుతారో తెలియాలంటే కొద్దిపాటి నిరీక్షణ తప్పదు మరి...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X