బాలయ్య ఫ్యామిలీలోకి తెలుగు హీరోయిన్.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన సినిమాలు చేస్తూ.. సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ.. స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఈ మధ్య కాలంలో ఆయన వరుసగా విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్‌తో దూసుకుపోతోన్నారు. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం మరింత ఉత్సాహంగా లైన్‌లో పెట్టుకుంటున్నారు.
బీభత్సమైన ఫామ్‌తో ముందుకు వెళ్తోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌లో డిఫరెంట్ యాక్షన్‌తో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎంతో హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయింది. ఇప్పుడు కూడా దీన్ని శరవేగంగా చేస్తున్నారు. వీలైనంత త్వరగా టాకీ పార్టును కంప్లీట్ చేసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ప్లాన్లు చేస్తున్నారు.
బాబీ - నందమూరి బాలకృష్ణ కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాను హై రేంజ్‌లో రూపొందిస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖులను భాగం చేశారని అంటున్నారు. అలా ఈ చిత్రం కోసం ఇప్పటికే ఊర్వశీ రౌటేలా, బాబీ డియోల్, గౌతమ్ మీనన్ వంటి స్టార్లను తీసుకున్నారు. తెలుగు హీరోయిన్ చాందినీ చౌదరి కూడా ఓ పాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే..

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి చేస్తున్న పాత్ర గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఇందులో ఆమె బాలయ్యకు బంధువుగా నటిస్తుందట. ఆమె పాత్రను విలన్ గ్యాంగ్ చంపేస్తుందని, దానికి ప్రతీకారంగా హీరో వాళ్లపై పగ తీర్చుకోబోతున్నాడని అంటున్నారు. దీంతో చాందినీ చౌదరి రోల్‌పై అందరిలోనూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. బాబీ దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్టుతో.. బాలయ్య మార్క్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











