క్రేజీ కాంబినేషన్..ఆసక్తి రేపుతున్న అనుష్క కొత్త సినిమా విశేషాలు.. నాని గెస్ట్ రోల్!
Recommended Video

టాలీవుడ్ లో అనుష్కకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేడి ఓరియంటెడ్ చిత్రంతో అయినా స్టార్ హీరో రేంజ్ లో అనుష్క సినిమాలకు కలెక్షన్లు వస్తాయి. హీరోయిన్ గా గ్లామర్ రోల్స్, లేడి ఓరియంటెడ్ చిత్రాలలో అద్భుత నటన ఇలా అన్ని అంశాలలో అనుష్క క్రేజ్ సంపాదించుకుంది. భాగమతి చిత్రం తరువాత అనుష్క నటించే సినిమాకు ఇంతవరకు క్లారిటీ రాలేదు. అనుష్క కొత్త సినిమా గురించి తాజాగా ఆసక్తికరమైన విశేషాలు బయటకు వస్తున్నాయి.

క్రేజీ కాంబినేషన్
అనుష్క కొత్త చిత్రం క్రేజీ కాంబినేషన్ లో రూపొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రశేఖర్ ఏలేటి అనుష్క కోసం ఓ లేడి ఓరియంటెండ్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడానికి ముందుకు వచ్చారట.

నాని గెస్ట్ రోల్
ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని కీలకపాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. నాని చేయబోయేది గెస్ట్ రోల్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం విశేషం. కథ వినగానే ఈ చిత్రాన్ని నిర్మించడానికి మైత్రి మూవీస్ వారు అంగీకరించినట్లు తెలుస్తోంది.

మరో ఇద్దరు కీలక నటులు
నాని తో పాటు మరో ఇద్దరు నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై అధికారిక సమాచారం రావలసి ఉంది. అంతా ఓకె అయ్యాక మైత్రి మూవీస్ అధికారికంగా ఈ విషయాన్ని త్వరలో ప్రకటిస్తారని సమాచారం.

భారీ చిత్రాలతో
ఇటీవల చంద్రశేఖర్ ఏలేటి, నాని కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. వాస్తవానికి అది అనుష్క సినిమా అని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వరుసగా బడా చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఒకే అయితే మరో క్రేజీ చిత్రం వారి బుట్టలో పడ్డట్లే.


Click it and Unblock the Notifications











