చంద్రశేఖర్ ఏలేటికి మరో ఆఫర్.. స్టార్ హీరోతోనే?
టాలీవుడ్ లో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఆయన చెసిన సినిమాలు కమర్షియల్ గా అంతగా క్లిక్కవ్వకపోయినా కూడా ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త పాయింట్ ను హైలెట్ చేస్తుంటారు. ఇక రీసెంట్ గా చెక్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
ఇక నెక్స్ట్ మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ చేతిలో కథలు చాలానే ఉన్నాయట. థ్రిల్లర్ కథలతో పాటు సాహసం లాంటి అడ్వెంచర్ కథలు కూడా ఉన్నాయట. భవిష్యత్తులో తప్పకుండా సాహసం కంటే హై రేంజ్ లో మరొక అడ్వెంచర్ కథను తెరకెక్కిస్తాని చెక్ ప్రమోషన్ లో చెప్పాడు. ఇక నెక్స్ట్ ఈ దర్శకుడు చేయబోతున్న సినిమాపై చర్చలు మొదలైనట్లు సమాచారం.

అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తోనే సినిమా ఉంటుందని సమాచారం. ఇక సినిమాలో స్టార్ హీరో నటించే అవకాశం ఉందట. చంద్రశేఖర్ సరైన కథను అనుకున్నట్లు తీస్తే తప్పకుండా బాక్సాఫీస్ హిట్ కొట్టగలడని మైత్రి మూవీ మేకర్స్ ఫుల్ ఫ్రీడమ్ తో ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఆ సినిమాతో అయినా చంద్రశేఖర్ బాక్సాఫీస్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











