Don't Miss!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మాయ చేస్తున్న మెగా హీరో..క్యూ కడుతున్న క్రేజీ దర్శకులు!
Recommended Video
మెగా మేనల్లుడిగా సాయిధరమ్ తేజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మేనమామలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పోలికలే కాదు వారిలోని ఎనర్జీని సైతం తేజు వారసత్వంగా పొందాడు. కెరీర్ ఆరంభంలో వరుస హిట్లు కొట్టిన తేజు ఆ తర్వాత ప్లాప్ లని చవి చూశాడు. తిక్క, విన్నర్, నక్షత్రం మరియు జవాన్ చిత్రాలన్నీ నిరాశపరిచాయి. కానీ ఆ ప్రభావం తేజు కెరీర్ పై పడకపోవడం ఆశ్చర్యకరమే. వరుస సినిమాలతో బిజీగా మారుతున్న సాయిధరమ్ తేజ్ మరో ప్రతిభగల దర్శకుడికి కమిట్ అయినట్లు తెలుస్తోంది.
కొత్త కథకి పచ్చ జెండా ఊపిన తేజు
విభిన్న చిత్రాలతో చంద్రశేఖర్ ఏలేటి ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఆయన చిత్రాలు ఉంటాయి. తాజాగా చంద్రశేఖర్ ఏలేటి సాయిధరమ్ తేజ్ ని కలసి కథ వినిపించాడట. అందులో తేజు కోసం ఏలేటి సరికొత్త పాత్రని డిజైన్ చేసాడట. తన క్యారక్టరైజేషన్ నచ్చడంతో తేజు వెంటనే ఒకే చెప్పేసినట్లు తెలుస్తోంది.
మూడో మెగా హీరో తేజునే
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్న మూడవ మెగా హీరో సాయిధరమ్ తేజ్ కావడం విశేషం. గతంలో కరుణాకరన్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేశాడు.
విడుదలకు రెడీగా ఉన్న ఇంటెలిజెంట్!
వివి వినాయక్ దర్శకతంలో సాయిధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 9 న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. వివి వినాయక్ మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చిన దర్శకుడు. మెగా హీరోలతో వినాయక్ దర్శకత్వం వహించిన ఠాగూర్, ఖైదీ నెం 150, బన్నీ మరియు నాయక్ వంటి చిత్రాలన్నీ విజయం సాధించాయి. దీనితో ఇంటెలిజెంట్ మూవీపై కూడా మెగా ఫాన్స్ ఆశలు పెట్టుకుని ఉన్నారు.
ప్లాపుల ప్రభావం ఎందుకు లేదంటే..!
వరుసగా ప్లాపులు ఎదురవుతున్నా తేజు చిత్రాల జోరు మాత్రం ఆగడం లేదు. వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. మేనమామల పోలికలతో ఎంట్రీ ఇచ్చిన తేజు డాన్సులు, నటన పరంగా మెగా ఫాన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. ప్రేమ కథలు, వినోదాత్మక కథలు అన్ని రకాలపాత్రలకు తేజు బాడీ లాంగ్వేజ్ సరిపోతుండడంతో దర్శకులంతా ఈ మెగా హీరో వెంట పడుతున్నట్లు తెలుస్తోంది.