Kalki 2898 AD: చంద్రబాబు, పవన్‌తో ప్రభాస్.. చాలా పెద్దదే ప్లాన్ చేస్తున్నారుగా!

టాలీవుడ్‌ నుంచి వచ్చే చిత్రాలు ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నాయి. అందులోనూ కొన్ని సినిమాలు అయితే పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతున్నాయి. అలాంటి సినిమాల్లో 'కల్కి 2898 ఏడీ' ఒకటి. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం టైం ట్రావెల్ కథతో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన విషయం తెలిసిందే.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రమే 'కల్కి 2898 ఏడీ'. హాలీవుడ్ రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కించారు. దీనికితోడు ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్లు కూడా ఉండడంతో ఇది భారీ హైప్‌ను క్రియేట్ చేసుకుని విడుదలైంది.

Chandrababu and Pawan Kalyan Chief Guests For Kalki 2898 AD Movie Success Meet

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ' మూవీని జూన్ 27వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8500లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో ఈ సినిమా హడావిడి భారీ స్థాయిలో కనిపిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతూ రూ. 650 కోట్లు వరకూ కలెక్షన్లను రాబట్టింది.

ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీ సూపర్ సక్సెస్ అయింది. మరికొద్ది రోజుల్లోనే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సైతం చేరుకోబోతుంది. అదే సమయంలో రూ. 1000 కోట్లు గ్రాస్‌ దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ఒక వార్త ఫిలిం నగర్ ఏరియాలో బాగా వైరల్ అవుతోంది.

Chandrababu and Pawan Kalyan Chief Guests For Kalki 2898 AD Movie Success Meet

ఫిలిం సర్కిళ్ల సమాచారం ప్రకారం... 'కల్కి 2898 ఏడీ' చిత్రం సక్సెస్ మీట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు స్టార్లు హాజరవుతారని తెలిసింది. దీంతో ఈ వేడుక కోసం అంతా వేచి చూస్తున్నారని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్‌ను ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X