Kalki 2898 AD: ప్రభాస్ కోసం చంద్రబాబు, పవన్.. మరో ఇద్దరు బడా స్టార్లు కూడా!
తెలుగు సినిమా పరిశ్రమ రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇక్కడి హీరోల స్థాయి కూడా ఓ రేంజ్‌లో రెట్టింపు అవుతూ వెళ్తోంది. ఇలా ఇప్పటికే చాలా మంది పాన్ ఇండియా స్టార్లుగా మారారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. 'బాహుబలి' నుంచి తన లెవెల్‌ను పెంచుకుంటోన్న అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ఫుల్ జోష్‌తో వెళ్తున్నాడు.
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమానే 'కల్కి 2898 ఏడీ'. పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. దీనికితోడు ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్లు కూడా ఉండడంతో దీని కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీని జూన్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఈ సినిమా హడావిడే కనిపిస్తోన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటికే ముమ్మరం చేసేసింది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని జూన్ మూడో వారంలోనే జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది.

ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు వస్తారన్న దానిపైనా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరవుతారని తెలిసింది. దీంతో ఈ వేడుక కోసం అంతా వేచి చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. విజువల్ వండర్‌గా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











