బాలయ్య హిట్లతో చంద్రబాబు ఖుషి ఖుషి!
ఒక గొప్ప దర్శకుడు అని పేరు పడిన తర్వాత అతనితో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటారు. మరి కొందరు హీరోలయితే ఆ దర్శకుడితో ఒక్క సినిమా చేసినా చాలు అనుకుంటున్నారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారు? దర్శకధీర యస్.యస్. రాజమౌళి.
ప్రస్తుతం రాజమౌళిపై నటసింహాం బాలయ్య కన్నుపడింది. సింహా చిత్రం విజయం సాధించడంతో వరుసగా రెండు భారీ చిత్రాలు బాలయ్యను ఆహ్వానించాయి. ఇవి కాకుండా 'మగధీర" వంటి ఇండస్ట్రీ రికార్డునిచ్చిన దర్శకుడితో ఒక్క సినిమా అయినా చేయాలి అని భావించిన బాలయ్య వెంటనే రాజమౌళితో మంతనాలు జరుపుతున్నాడని సమాచారం.
సింహా హిట్ తర్వాత వరుసగా సినిమాలు బుక్ అవ్వడంతో బాలయ్య బహు హుషారుగా ఉంటే బావ చంద్రబాబు మరింత ఖుషీగా ఉన్నాడంట ఎందుకుంటారా? ఎందుకేమిటి మరో ఆరేడేళ్లు బాలయ్య పోరు బాబుకి తప్పినట్టేగా! అందుకు.
బాలకృష్ణ సింహా నయనతార నమిత స్నేహా ఉల్లాల్ చంద్రబాబు రాజమౌళి మగధీర balakrishna nayantara namitha sneha ullal chandrababu rajamouli magadheera


Click it and Unblock the Notifications