తారకరత్నకు బాబు బ్రేక్?

By Staff

Tarakaratna
నందమూరి తారకరత్న తీరుపై చేస్తున్న కామెంట్స్ పై తెలుగు దేశం అధినేత చంద్రబాబు చాలా కోపంగా ఉన్నారని సమాచారం. రెండు రోజుల క్రింతం తారకరత్న చేబ్రోలు మండలంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలే పెట్టడమేంటి అని నిరసన వ్యక్తం చేయటం,నిలదీయటం పార్టీ ప్రతిష్టన తగ్గిస్తుందని ఆయన బావిస్తున్నారు. దాంతో ఎవరినుంచి రానటువంటి సమస్యలు అతను వైపునుంచి వస్తున్నాయని సన్నిహితులు వద్ద ఆయన మండిపడుతూ చెప్పారని తెలుస్తోంది.నందమూరి హీరోల్లో అందరికంటే ముందు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలుకు తారకరత్న అటెండవుతున్నారు. అలాగే కొన్నిచోట్ల కాబోయో సీఎం బాలయ్య బాబయ్యో నంటూ ప్రటించి వివాదస్పదమయ్యారు. మరో ప్రక్క చంద్రబాబు తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా తాను సమైక్యవాదినని తెలుగు వారందరూ కలిసి ఉండాలంటూ తారకరత్న ప్రకటన చేయటం జరిగింది.

పార్టీ క్రమశిక్షణను దెబ్బతీస్తునని భావించిన చంద్రబాబు జిల్లా నేతల నుండి సమాచారం తెప్పించుకుని వెంటనే తారకరత్న దూకుడుకి బ్రేకులు వేయాలని నిర్ణయించుకున్నారని అంతర్గత వర్గాల సమాచారం. అలాగే తారకరత్నకు పార్టీ పరంగా ఎక్కువ ప్రాధాన్యతనివ్వద్దని, నేతలుకు ఆయన చెప్పినట్లు సమాచారం. సాధ్యమైనంత వరకూ జిల్లాల్లో పార్టీ పరంగా ఎలాంటికార్యక్రమాలకు ఆహ్వానించవద్దని సంకేతాలచ్చినట్లు చెప్తున్నారు. ఒకవేళ అభిమానులు అంతగా పిలిస్తే...అందులో పార్టి నేతలు భాగస్వాములు కావద్దని,తప్పదు అనిపిస్తే మొక్కుపడిగా మొహం చూపించి వెళ్లిపోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఏదైమైనా తారక్ కి బ్రేక్ వేయకపోతే భవిష్యత్ లో చాలా తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ వర్గాలతో పాటు బాబు కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X