twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్ 'చంద్రముఖి-2' చిత్రం విడుదల తేదీ ఎప్పుడంటే

    By Srikanya
    |

    వెంకటేష్,పి.వాసు కాంబినేషన్ లో రూపొందుతున్న చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపకుంటున్న ఈ చిత్రం ఆడియోను ఈ నెలాఖరున విడుదల చేసి, చిత్రాన్ని నవంబర్ 11 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా అనూష్క చేస్తోంది. చింతకాయల రవి తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే. ఇక ఈ పీరియాడిక్ ధ్రిల్లర్ లో వెంకటేష్ వృధ్దుడు గెటప్ లో కూడా కనిపించనున్నాడని సమాచారం.

    ఈ చిత్రానికి మూలమైన కన్నడ ఆప్త రక్షకలో వెంకటేష్..విష్ణు వర్దన్ ఆ పాత్రను పోషించాడు. ఆప్త రక్షక కన్నడ చిత్రాన్ని కూడా పి.వాసు డైరక్ట్ చేసారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రంలో అనూష్కతో పాటు కమలినీ ముఖర్జీ , శ్రద్ధాదాస్‌, పూనమ్ కౌర్‌, రిచా గంగోపాధ్యాయ వెంకీతో ఆడిపాడతారు సాంకేతికంగా ఉన్నత విలువలతో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో 'లక లక లక లక' డైలాగుని 'లీడర్‌' చిత్రంతో పరిచయమైన రిచా గంగోపాధ్యాయ చెప్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X