ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ తో గోపిచంద్ మరో సారి...
గతంలో'ఒక్కడున్నాడు"చిత్రం రూపొందించిన చంద్రశేఖర్ ఏలేటితో మరోసారి మళ్లీ గోపీచంద్ మరో చిత్రం చేయనున్నాడు. మొన్నటి వరకూ వెంకటేష్ తో సినిమా చేద్దామని తిరిగిన యేలేటి అది వర్కవుట్ కాకపోవటంతో మళ్ళీ గోపిచంద్ వద్దకు చేరాడు. ఆ మధ్యన ఆ కథను కళ్యాణ్ రామ్ కి వినిపించినా వర్కవుట్ కాలేదు. అయితే గోపిచంద్ మాత్రం అతని క్రియేటివ్ ధాట్స్ మీద నమ్మకంతో చేద్దామని హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇక గోపీచంద్ కూడా వరస ఫ్లాపుల్లో మునిగి తేలుతున్నాడు. వాంటెడ్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత గోపీచంద్ డైలమోలో పడ్డారు.
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న 'మొగుడు" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించే చిత్రం చేస్తారని చెప్తున్నారు. ఇక గోపిచంద్ కి యేలేటిని రికమెండ్ చేసింది కూడా కృష్ణ వంశీ అని చెప్తున్నారు. ఇంతకు ముందు ఒక్కడున్నాడు టైమ్ లో ఆ చిత్రంలోని పాటలను కృష్ణ వంశీనే షూట్ చేసారు. ఇక ఈ కొత్త చిత్రం చాలా విభిన్నమైన కాన్సెప్టుతో ఓ ధిల్లర్ తరహా నేరేషన్ తో సాగుతుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











