బన్ని 'ఇద్దరు అమ్మాయిలతో..' కు లొకేషన్ సమస్య

By Srikanya

హైదరాబాద్: అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం 'ఇద్దరు అమ్మాయిలతో..'. ఈ చిత్రం దీపావళి(నవంబర్ 13)నుంచి షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దాదాపు అరవై రోజుల పాటు స్పెయిన్ లోని బార్సిలోనా ప్రాంతంలో ఈ చిత్రంలో ఎక్కువ శాతం షూటింగ్ జరుపటానికి ప్లాన్ చేసారు. అయితే స్పెయిన్ లో ఈ చిత్రం లొకేషన్స్ కు సమస్యలు వచ్చాయని తెలుస్తోంది. దాంతో పూరి అర్జెంటుగా లొకేషన్స్ ను ఛేంజ్ చేసే పనిలో ఉన్నారు. ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ లొకేషన్ గా ఫిక్స్ చేయటానికి దర్శక, నిర్మాతలు కుస్తీ పడుతున్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రం ఇద్దరు అమ్మాయిలతో ఫారిన్ లో ప్రేమలో పడి వారితో ఇబ్బందులు పడ్డాడు అనే పాయింట్ చుట్టూ తిరగనుంది. దేశముదురు కాంబినేషన్ అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ ని రిపీట్ చేస్తూ బండ్ల గణేష్ రూపొందించే ఈ చిత్రం బారీగా రూపొందనుంది. హీరోయిన్స్ సెంట్రల్ గా నడిచే కధ కాబట్టి ఆ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో చేసే ఇద్దరు హీరోయిన్స్ లో తాప్సీ ని ఎంపికచేసారు. మరొకరు కోసం చూస్తున్నారు. 2013 సమ్మర్ కి విడుదల అయ్యే ఈ చిత్రం కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''కథ గురించి ఇప్పుడే ఏమీ చెప్పను. నాకెంతో నచ్చింది. ఎప్పట్నుంచో సినిమా చేద్దాం అని గణేష్ అడుగుతున్నారు. ఈ చిత్రంతో కుదిరింది. ఒక మంచి నిర్మాతకు కావల్సిన అన్ని లక్షణాలు గణేష్‌లో ఉన్నాయి. 'దేశముదురు' సమయంలో నేను సిక్స్‌ప్యాక్ చేయగలిగానంటే దానికి కారణం జగన్‌ గారే. చెప్పిన సమయానికి షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి, నాకు వర్కవుట్లు చేసుకునే అవకాశం కల్పించేవారు'' అన్నారు.

పూరి చిత్రం గురించి చెబుతూ ''ఇదో ప్రేమ కథా చిత్రం. బన్నీ అంటేనే ఎనర్జీ. తనే కాదు సెట్‌లో అందర్నీ ఉత్సాహంగా ఉరకలేయిస్తారు. ఈ కథను అల్లు అరవింద్‌కు చెప్పినపుడు మావాడికి బాగుంటుందని చెప్పారు. తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరో. ఈ సినిమా కథను బన్నీకి చెప్పినప్పుడు.. మనమే చేద్దాం అన్నాడు. ఆ తర్వాత అరవింద్‌ గార్ని కలిసినప్పుడు 'బన్నీకి ఒక కథ చెప్పావట.. అది తనతోనే చెయ్యి. తనకు బాగా నచ్చింది' అన్నారు. ఇది లవ్‌స్టోరి. నవంబర్ రెండవ వారంలో షూటింగ్ ఆరంభిస్తాం. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం షూటింగ్ చేస్తాం''అన్నారు.

అల్లు అర్జున్‌ని మాస్‌లోకి చొచ్చుకువెళ్లేలా చేసిన సినిమా 'దేశముదురు'. పూరి జగన్నాథ్ మార్క్ పాత్ర చిత్రణతో అందులో అల్లు అర్జున్ పూర్తి మాసివ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించారు. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందనుంది. వైవిధ్యభరితంగా టైటిల్స్ పెట్టే పూరి ఈ చిత్రం కోసం 'ఇద్దరమ్మాయిలతో' అనే టైటిల్ ఫిక్స్ చేయటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. పూరి తరహా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందనుంది. అమలా పాల్‌, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X