Bigg Boss 9 Telugu: ఇకపై అలాంటి కంటెస్టెంట్స్‌కి నో ఎంట్రీ.. బిగ్‌బాస్ నిర్వాహకుల షాకింగ్ డెసిషన్?

దేశంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు విశేషంగా అలరించిన కార్యక్రమం బిగ్‌బాస్. హిందీ నుంచి ప్రాంతీయ భాషలకు పాకిన మెగా షో అంచనాలకు మించి రాణిస్తోంది. మొదట్లో ఈ గేమ్ అర్ధం కావడానికి టైం పట్టినప్పటికీ, సాంప్రదాయవాదుల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ బిగ్‌బాస్ నిరాటంకంగా కొనసాగుతోంది. తెలుగు విషయానికి వస్తే ఇప్పటి వరకు 8 సీజన్లను కంప్లీట్ చేసుకుని త్వరలో సీజన్ 9కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు? ఎప్పటి నుంచి ఈ షో ప్రారంభం కానుంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.

ఊరుపేరు లేని కంటెస్టెంట్స్‌తో చిరాకు

గతేడాది డిసెంబర్‌లో బిగ్‌బాస్ 8 తెలుగు ముగియగా కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ టైటిల్‌ను తన్నుకుపోగా.. గౌతమ్ కృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. ఈ మెగా షోకు అలా ఎండ్ కార్డ్ పడిందో లేదో వెంటనే తర్వాతి సీజన్ ఎప్పటి నుంచి మొదలు కానుంది? అనే దానిపై అప్పటి నుంచే చర్చ మొదలైంది. కొన్ని కారణాలతో బిగ్‌బాస్ షోకు క్రేజ్ తగ్గుతున్న నేపథ్యంలో ఈసారి టీఆర్పీలు అదిరిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఊరు పేరు లేని కంటెస్టెంట్స్‌ జనానికి నచ్చడం లేదు. దీంతో ఈసారి ఫేమ్ ఉన్న వారిని పట్టే పనిలో బిగ్‌బాస్ టీమ్ ఉంది.

Changes in Bigg Boss Is the Social Media influencers not Allowed in this reality show

బిగ్‌బాస్ ప్రారంభానికి ముందే లిస్ట్ వైరల్

సీజన్ మొదలవ్వకముందే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈసారి కూడా పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. అలేఖ్య చిట్టి పికెల్స్‌కు చెందిన సిస్టర్స్‌లో రమ్య మోక్ష ఈసారి బిగ్‌బాస్‌లో అడుగుపెడతారంటూ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే సుప్రీత, తేజస్వి మదివాడ, తేజస్విని గౌడ, రీతూ చౌదరి వంటి వాళ్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే బిగ్‌బాస్ 9 తెలుగుకు సంబంధించి బిగ్‌బాస్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇకపై హౌస్‌లోకి వాళ్లకి నో ఎంట్రీ

ఇకపై బిగ్‌బాస్ హౌస్‌లోకి సోషల్ మీడియా సెలబ్రెటీలకు తలుపులు మూసివేయనున్నారట. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ కొందరు సోషల్ మీడియా స్టార్స్, ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బిగ్‌బాస్ నో ఎంట్రీ తప్పదని అంటున్నారు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌లో సమూల మార్పులు తీసుకురానున్నట్లుగా బాలీవుడ్ టాక్. ఇదే విధానాన్ని ప్రాంతీయ భాషల్లో టెలికాస్ట్ కానున్న బిగ్‌బాస్‌కు కూడా వర్తింపజేయాలని అనుకుంటున్నారట. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి తప్పించి సాధారణ ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని ఇలాంటి వారి వల్ల షో ఇమేజ్ డ్యామేజ్ కావడంతో పాటు ప్రజల్లో క్రేజ్ తగ్గుతున్నట్లుగా నిర్వాహకులు గుర్తించారు.

తెలుగు బిగ్‌బాస్‌పై ప్రభావమెంత?

నష్ట నివారణ చర్యల్లో భాగంగా సోషల్ మీడియా స్థార్స్‌కి తలుపులు మూసివేయాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరికి బదులు టీవీ, సినీ రంగాల్లో పేరున్న నటులు, కాస్త కాంట్రవర్సీ క్యారెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట. బిగ్‌బాస్ ప్రారంభ సీజన్‌లో ఎలాంటి గ్లామర్ అప్పీల్ ఉండేదో దానిని తిరిగి తీసుకురావాలని నిర్వాహకులు పట్టుదలగా ఉన్నారట. ఒకవేళ హిందీ బిగ్‌బాస్‌లో ఈ మార్పులు అమలైతే మాత్రం.. త్వరలో ప్రారంభం కానున్న తెలుగు బిగ్‌బాస్ విషయంలోనూ పరిగణనలోనికి తీసుకునే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X