ఆశ్చర్యం కలిగిస్తూ...చిరు అడుగు జాడల్లో చరణ్...!?
చిరంజీవి ఎదుగుదలలో అతని అణుకువ ప్రధాన పాత్ర పోషించిందని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వమే అతడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని ఎవరైనా ఓప్పుకుని తీరాలి. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన చిరంజీవిలో అలాంటి అక్షనాలుండడం ఆశ్చర్యకర విషయమేం కాదు.
అయితే సిల్వర్ స్పూన్ తో పుట్టిన అతని తనయుడు రామ్ చరణ్ కి అలాంటి సలక్షణాలే ఉండాలని లేదు. కానీ చరణ్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ పెద్దల వద్ద చాలా వినమ్రతతో ఉంటున్నాడు. సినిమా పెద్దలకి తనిచ్చే మర్యాద ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూతురి పెళ్లిలో చరణ్ కనిపించిన పెద్దలందరినీ పేరు పేరునా పలకరించి వారి ఆశీస్సులు తీసుకున్న వైనం అందర్నీ అమితంగా ఆకర్షించింది. తన కెరీర్ లో ఎంత ఎదిగినా కానీ ఇదే విధంగా చరణ్ నడుచుకోగలిగితే చిరంజీవిని మించిపోతాడనడంలో సందేహం అక్కర్లేదు...
More from Filmibeat
ram charan teja chiranjeevi shyam prasad reddy tollywood రామ్ చరణ్ తేజ్ చిరంజీవి శ్యామ్ ప్రసాద్ రెడ్డి టాలీవుడ్


Click it and Unblock the Notifications











