రామ్ చరణ్ కి అవమానము జరిగిందని ఫ్యాన్స్ గగ్గోలు...
మగధీర తర్వాత వస్తున్న సినిమా అనగానే 'ఆరెంజ్"ను ప్రేక్షకులు, బయ్యర్స్ ఎంతో ఆశగా చూశారు. ప్రేక్షకులు ఈ సినిమా మాకొద్దు అని తిప్పికొట్టారు. కానీ, బయ్యర్స్ ఆ పని చేయలేరు కదా. సినిమా ఎంత ప్లాప్ అయినా మగధీర క్రేజ్ తో ఆ సినిమాలో సగం అయినా కలెక్ట్ చేస్తుందని, కొంత నష్టంతో బయట పడొచ్చని ఎక్స్ పెక్ట్ చేశారు. అక్కడా బెడిసికొట్టింది. మగధీర కలెక్ట్ చేసినదాంట్లో 25శాతం కలెక్షన్స్ రాబట్టడానికి నానా తంటాలు పడింది ఆరెంజ్.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని మెయిన్ థియేటర్ లో కనీసం 50రోజులయినా ఆడిస్తారు. కానీ, ఆరెంజ్ విషయంలో అది జరగలేదు. ఐదు వారాలకే సినిమా తీసేసి 'రంగ ది దొంగ" వేయబోతున్నారు. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రామ్ చరణ్ కి ఇది ఇన్సల్ట్ అనే చెప్పాలి. ఈ విషయంలో అభిమానులు చాలా బాధపడుతున్నారు. మగధీర లాంటి హిట్ ఇచ్చిన తమ హీరో సినిమాకి హైదరాబాద్ లో కూడా 50రోజుల రన్ కాకపోవడం అవమానంగా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications