రామ్ చరణ్ ‘ఎవడు’ విడుదల తేదీ ఖరారు

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం జులై 31న విడుదల కావాల్సి ఉంది. అయితే రకరకాల కారణాలతో ఈ చిత్రం విడుదల చేయటం లేదని నిర్మాత ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఎవడు విడుదల తేదీపై రకరకాల ప్రచారాలు మీడియాలోనూ,ఫిల్మ్ సర్కిల్స్ లోనూ జరిగాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'ఎవడు' విడుదల తేదీ ని అక్టోబర్ 10న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లోగా రాష్ట్రంలో ఉన్న అనిశ్చితి సర్దుకుంటుందని భావిస్తున్నారు. అలాగే ఈ మద్యలో రామ్ చరణ్ నటించిన హిందీ చిత్రం తుఫాను సెప్టెంబర్ 6 న విడుదల అవుతుంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

'ఎవడు' త్వరలో విడుదలవుతుంది. అల్లు అర్జున్‌కి జంటగా నటిస్తున్నాను. ఇందులో నాది చిన్న పాత్రే అయినా బాగుంటుంది. కథలో నా పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత సినిమాలో వచ్చే మార్పులు కీలకమని కాజల్ చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ఎవడు చిత్రంలో ఆమె అల్లు అర్జున్ సరసన చేస్తోంది. గెస్ట్ రోల్ కోసం ఈ చిత్రంలో ఆమెను తీసుకున్నారు. ఆమె పాత్ర నచ్చి, చిన్నదైనా చేసానని చెప్తోంది.

'ఎవడు' చిత్రం విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ...ఓ విషయంలో మాత్రం కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇంకా విడుదల కానప్పటికీ హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్మడు పోయినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం రూ. 3.60 కోట్లు హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడయినట్లు టాక్. చిరంజీవికి సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు ఇంత భారీమొత్తం వెచ్చించి థర్డ్ పార్టీగా కొనుగోలు చేసాడని, దీన్ని ఆయన హిందీ ఎంటర్టెన్మెంట్ చానల్స్‌కు మరింత భారీ రేటుకు అమ్మాలనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X