చిరంజీవికి నచ్చకపోయినా ఆ స్క్రిప్టుతోనే వెళ్ధామనే రామ్ చరణ్
రామ్ చరణ్, ధరణి కాంబినేషన్ లో ఆ మధ్య మెరుపు చిత్రం ప్రారంభమై ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆగిపోవటానికి చిరంజీవే కారణమని,ఆరెంజ్ ప్లాప్ కావటంతో భారి బడ్జెట్ సినిమా వద్దని ఆపుచేసారని చెప్పుకున్నారు.అలాగే అదే నిర్మాతతో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రం ప్రారంబిస్తున్నారు. అయితే రామ్ చరణ్ కి ఆ కథ పిచ్చ పిచ్చగా నచ్చిందని,తన తండ్రి వద్దనటంతో వేరే దారిలేక ఆపుచేసాడని, వేరే నిర్మాత ఎవరూ ఆ ప్రాజెక్టు చేయటానికి ముందుకురాకపోతే తానే సొంతంగా చేసుకోవాలని అనుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ వార్త. అందుకోసం ఫైనాన్సియర్స్ ని, పార్టనర్స్ ని వెతుకుతున్నాడని చెప్ప్పుకుంటున్నారు. అందుకోసం తానే కొందరి వద్ద ఈ ప్రపోజల్ పెడుతున్నాడు.మెరపు మీద తనకు ఉన్న నమ్మకాన్ని తన డేట్స్ రూపంలో ఇస్తానని చెప్తున్నాడు.ఇక చరణ్ తో చేయాలనుకున్న నిర్మాతలు కొందరు ఈ విషయమై ఆలోచనలో పడ్డారని,అయితే చిరు కి ఇష్టంలేని ప్రాజెక్టుపై పెట్టుబడి పెట్టి ఎంతవరకూ ముందుకెళ్ళగలమని వారు చర్చించుకుంటున్నారు. కొందరైతే ఈ ప్రపోజల్ తో చిరుని కలిసి మాట్లాడి అప్పుడు పెట్టుబడి పెట్టాలని అనుకుంటన్నారు. చరణ్ ఇంతలా మక్కువ పెంచుకునే పాయింటు ఆ చిత్రంలో ఏముందా అనేది ఇప్పుడు అందరిలో తొలుస్తున్న ప్రశ్న.


Click it and Unblock the Notifications