చార్మికీ మంచు మనోజ్ కీ మధ్య 'కుచ్ కుచ్ హోతా హై'?
చార్మింగ్ గర్ల్ చార్మికీ, మంచు మనోజ్ కీ మధ్య రిలేషన్ బాగా పెరుగుతోందని, అది ప్రేమ లేక మరోదోనా అనేది చెప్పలేమని ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొద్ది రోజులుగా వినపడుతోంది. అందులోనూ రీసెంట్ గా చార్మి తాజా చిత్రం మంగళ ఆడియో పంక్షన్ కి మనోజ్ ఛీఫ్ గెస్ట్ గా రావటం కూడా కారణంగా చూపెడుతున్నారు. చార్మి తమ మధ్య స్నేహం తప్ప మరేమి లేదని కొట్టిపారేస్తున్నా ఏమీ లేదన్న మాటల్లోనే ఏదో ఉందనే అంతరార్ధం ఉందని అంటున్నారు. అలాగే మంచు మనోజ్ చెప్పటంతో అతని సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న..వర్మకి చార్మిని సిపార్సు చేసి దొంగల ముఠాలోకి తీసుకువచ్చిందని అలా ఆమె కెరీర్ కి కూడా మనోజ్ తన సాయం చేస్తున్నాడని చెప్తున్నారు. అయితే ఇద్దరి కెరీర్ లు పెద్ద గొప్పగా లేకపోయినా ఒకరి సలహాలు మరొకరు తీసుకుంటున్నారని, సంగీత దర్శకుడు దేవికి దూరమైన ఆమె మనోజ్ కి దగ్గరువుతోందని తెలుస్తోంది.అలాగే మనోజ్ కూడా స్నేహా ఉల్లాల్ కి దూరమయ్యాడు. దాంతో ఇద్దరూ పబ్ లు, నైట్ పార్టీలులో తరుచూ కలుస్తున్నారని అంటున్నారు. ఇక ఈ రిలేషన్ ఎక్కడదాకా వెళ్తుంది అన్నది కాలమే తేల్చాలి.


Click it and Unblock the Notifications











