'ఛార్మి'నార్...

ఆ సినిమాల బాక్సాఫీసు ఫలితంతో సంబంధం లేకుండా ఛార్మి యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు వారు ఛార్మి జపం చేస్తున్నారు. ఆ సినిమాలతో ఛార్మి దృక్పథంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. స్కిన్ షో విషయంలో ఆమె ఉదారంగా వ్యవహరిస్తుండంతో దర్శక నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం వెంటపడుతున్నారు. మొన్నటికి మొన్న 16 డేస్ చిత్రంలో లిప్ టు లిప్ సీను రెండు లక్షలు తీసుకుని మరి చేసిందని వార్తలు వచ్చాయి.
ఇప్పుడామె శ్రీకాంత్ కు జంటగా మూడవసారి చేస్తున్న 'కౌసల్యా సుప్రజా రామా' సినిమా షూటింగ్ నానక్‌రామగూడ సినీ విలేజ్‌లో జరుగుతోంది. సూర్యతేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బానర్‌పై డి రామానాయుడు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వేసిన ఒక ప్రత్యేకమైన సెట్లో శ్రీకాంత్, ఛార్మి, కృష్ణభగవాన్, సైరాబాను, శివారెడ్డి, ఎల్బీ శ్రీరామ్, అపూర్వ, హేమ తదితరులపై ఒక పాటను తీస్తున్నారు. తీస్తున్న ఆ పాటలోనూ ఛార్మి చక్కని సంప్రదాయ దుస్తులు ధరించినా, వాటిల్లోనూ ఆమె వంపుసొంపులు ప్రస్ఫుటమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారట.అలా ఆమె యేం చేసినా స్కిన్ షో ప్రధాన లక్ష్యంగా మారింది.అందుకే ఆమె తెలుగు నిర్మాతలుకు చూపించతగ్గ ఛార్మినార్ అవుతోంది.


Click it and Unblock the Notifications











