ఛార్మికి ఏం ఖర్మ పట్టింది!?
వరస ప్లాపుల ఛార్మీకి కావ్యాస్ డైరీ కూడా కలిసిరాలేదు. ఆమె తోటి హీరోయిన్స్ అనూష్క, జెనీలియా, ఇలియానా వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. దాంతో ఆమెకు కెరీర్ పై బెంగపట్టుకుని డిప్రెషన్ లోకి వెళ్తోందంటున్నారు. అందుకు తగినట్లుగానే ఆమె పూర్తిగా పార్టీలకు దూరమైంది. దరిదాపు ప్రతీరోజూ ఏదో ఒక పార్టీలో దర్శనమిచ్చే ఆమె గత కొంత కాలంగా ఎక్కడా కనపడటం లేదు. లక్కీ డ్రాలకు సైతం దూరంగా ఉంటోంది. ఒక్కసారి కెరీర్ ని పూర్తి స్ధాయిలో పరిశీలించుకుని తప్పులు సరిదిద్దుకోకుంటే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందనే సన్నిహితుల సూచనల మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఎక్కువగా ఒంటరిగా గడుపుతోందంటున్నారు. అయితే కొందరు మాత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ కి పరిమితమవటమే ఆమె కెరీర్ ని దెబ్బతీసిందని, తిరిగి గ్లామర్ పాత్రలతో వస్తే తప్పనిసరిగా నిలదొక్కుకుంటుందని చెప్తున్నారు. అయితే ఆమె ఒళ్ళు అపరిమింతంగా పెంచటం అవకాశాలను దూరంచేస్తోందంటున్నారు. అప్పటికీ ఇది గుర్తించే కావ్యాస్ డైరీలో బన్ను అని ముద్దు పేరు పెట్టారు.


Click it and Unblock the Notifications











