పాపం..చెప్పుకోలేని ఇబ్బందుల్లో చార్మి
నిజానికి చార్మి చేతిలో ఇప్పుడు చెప్పుకోదగ్గ చిత్రాలు లేవు. ఒకటి అరా ఉన్నా అవీ ఫైనలైజ్ కాలేదు. కానీ ఆమె నటించిన చిత్రాలు మాత్రం ఈ రెండు నెలల్లో దాదాపు నాలుగు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అవెక్కడనుంచి వచ్చాయి అంటే..ఆమె కన్నడంలో ఉపేంద్ర తో చేసిన చిత్రం ఒకటి 'జాదూగాళ్ళు' టైటిల్ తో డబ్బింగ్ చేసారు. ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఆమె తమిళంలో పి.వాసు దర్శకత్వంలో నటించిన ఓ చిత్రం 'ఇందు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. వీటితో పాటు ఆమె తెలుగులో నేరుగా నటించిన రెండు చిత్రాలు కూడా విడుదలకు వేచివున్నాయి.అవి వేణు హీరోగా దిలీప్ పోలన్ దర్శకత్వంలో యలమంచిలి రవిచంద్ నిర్మించిన 'మాయగాడు' చిత్రం ఒకటి.
అలాగే పవన్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మించిన 'సై ఆట' చిత్రం విడుదలకు సిద్ధంగా వున్నాయి. అయితే వీటిల్లో దేనికీ పెద్దగా చార్మి పేరు చెప్పి మార్కెట్ కాలేదు. ఉన్నంతలో ఉపేంద్ర పేరు చెప్పి 'జాదూగాళ్ళు' కొద్దో గొప్పో మార్కెట్ అయింది. దాంతో చార్మి వీటిల్లో ఏది ఆడుతుందో అని ఎదురు చూడాల్సిన స్ధితి వచ్చింది. అయితే శ్రీకాంత్ సరసన లేటెస్ట్ గా ఆమెకు ఓ ఆఫర్ వచ్చింది. అదే కాస్తంత ఉత్సాహాన్ని నింపుతోంది. దాంతో ఆమెకు ఏం సినిమాలు చేస్తున్నారు అంటే ఈ నాలుగు చెప్పాలా లేక కొత్తగా కమిటయింది చెప్పాలా అనే డైలమోలో ఉంది. ఇలా నాలుగు సినిమాలు ఉన్నాయి ..అదేంటి అవి ఎప్పుడో పూర్తయ్యాయి కదా మార్కెట్ కాలేదా అనే సానుభూతి చూపటం జరుగుతోందిట. అదీ పరిస్దితి.


Click it and Unblock the Notifications











