ఛార్మిని చేరదీస్తున్నాడు!?
కృష్ణవంశి..వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న ఛార్మితో రిలేషన్ షిప్ ని పురస్కరించుకుని ఆమెకు లైఫ్ ఇవ్వటానికి డిసైడ్ అయ్యాడనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. అనుకోకుండా ఒక రోజు చిత్రంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో బిజీ అయిన ఆమె మంత్రతో ఆ తరహా చిత్రాలకు ఆమే దిక్కన్నట్లు ఎదిగింది. అయితే సిక్సీన్ డేస్ వంటి చిత్రాలు ప్లాప్ అవటం మాయగాడు, కావ్యాస్ డైరీ వంటివి రిలీజ్ కాకపోవటం ఆమెను నిరాసలో ముంచాయి. రాఖీ తర్వాత ఆమె పెద్ద హీరోల ప్రక్కన సినిమా చేసింది లేదు. దాంతో ఆమె హీరోయిన్ ఓరియెండెట్ చిత్రాలంటూ దారితప్పిందని, మళ్ళీ హీరోయిన్ గా నిలబెడతానని హామీ ఇచ్చాడని తెలుస్తోంది.
అందుకణుగుణంగానే రవితేజతో తను చేయబోయే చిత్రంలో గ్లామర్ హీరోయిన్ గా పాత్ర ఇస్తాడని ప్రామిస్ చేసారని వినపడుతోంది. అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ మాత్రం ఈ ప్రపోజల్ కు పెద్ద సముఖంగా లేరని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రవితేజ కామెడీ టచ్ తో సాగే యాక్షన్ పాత్రలో కన్పించనున్నారు. ఎప్పటినుంచో ఈ స్టోరి లైన్ కృష్ణవంశి మనస్సులో ఉందని ఈ మధ్య ఓ పంక్షన్ లో కలిసిన రవితేజకు అది చెప్పటం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మిగతా పనుల్లో పడ్డారు. ప్రస్తుతం కృష్ణవంశి మహాత్మా చిత్రాన్ని చేస్తున్నారు. శ్రీకాంత్ వందవ చిత్రంగా తయారవుతున్న ఈ చిత్రం త్వరలోనే పూర్తవుతుంది. అలాగే ఈ కొత్త చిత్రం జూన్ రెండవ వారంలో ప్రారంభం అయి దీపావళికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











