పెళ్ళి పీటలు ఎక్కనున్న చార్మి
అనుకోకుండా ఒక రోజు, మంత్ర చిత్రాలలో తనేంటో నిరూపించుకున్న చార్మి త్వరలో పెళ్ళి చేసుకోబోతోందని వినికిడి. పంజాబ్ కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోనున్నట్లు పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందులోనూ ఈ మధ్య చార్మి కెరీర్ మరీ నాసిగా తయారవటంతో పెళ్ళి చేసుకుని సెటిల్ అవటం మేలని ఆమె భావించిందని చెప్తున్నారు. ఇక ఈ వివాహం ఆమె తల్లి తండ్రులు చూసిందేనని, గత సంవత్సర కాలంగా ఇద్దరూ టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. అయితే చార్మి మాత్రం ఇవన్నీ రూమర్స్ అని కొట్టిపారేస్తోంది. ఇక ఆ పంజాబి బిజినెస్ మేన్ ఈ మధ్యన హైదరాబాద్ కూడా వచ్చారని, చార్మి సన్నిహితులను కొందరిని కలిసి వెళ్ళాడు. అంటే త్వరలోనే చార్మి పెళ్ళి కూతురు కాబోతోందన్నమాట. ఇక కెరీర్ విషయానికి వస్తే ఆమె నటించిన జూదగాళ్ళు, ఇందు వంటి డబ్బింగ్ సినిమాలు తప్పిస్తే విడుదల అయ్యేవి ఏమీ కనపడటం లేదు. మంత్ర దర్శకుడు చార్మితో మంగళ అనే చిత్రం ప్రకటించాడు కానీ మొదలపెట్టలేదు.


Click it and Unblock the Notifications











