బాలకృష్ణ ప్రక్కన చివరకు ఆమెనే హీరోయిన్ గా...??

By Srikanya

హైదరాబాద్ : బాలకృష్ణకు హీరోయిన్స్ సమస్య వచ్చింది. ఆయన వయస్సుకు తగ్గ హీరోయిన్స్ దొరకటం లేదు. దాంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ప్రారంభం రోజు నాటికి కూడా హీరోయిన్ సెట్ కాలేదు. అయితే ఎరికా ఫెర్నాండెజ్‌ ని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాసాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అవేమీ నిజం కాదని ఆమె తేల్చి చెప్పేసింది.

ఈ నేఫధ్యంలో బాలకృష్ణ సరసన ఛార్మిని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. చేతిలో ప్రేమ ఒక మైకం చిత్రం తప్ప మరే చిత్రమూ లేని ఛార్మి ఈ ఆఫర్ రాగానే ఎగిరి గంతేసి ఒప్పుకుందని చెప్తున్నారు. అయితే అథికారికంగా ప్రకటన వస్తేగానీ నిజం ఏదనేది తెలియదు.

వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో పార్మల్ పూజా కార్యక్రమం జూన్ 3వ తేదీనే జరిగింది. బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 10న షూటింగ్ ప్రారంభమైంది.

ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా గురించి దర్శకుడు ఇటీవల మాట్లాడుతూ.... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X