»   » చివరకు చార్మి 'రియల్' బిజెనెస్ కూడా లాసే...

చివరకు చార్మి 'రియల్' బిజెనెస్ కూడా లాసే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చార్మికి వరసగా సినిమా ఫెయిల్యూర్ అయి కెరీర్ నష్టపోవటమే కాక ఆమె పెట్టుబడి పెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మునిగిపోయింది. ఆమె తనకు సలహాలిచ్చే హీరో సహాయంతో రియల్ వ్యాపారంలోకి దిగింది. అందుకోసం ఓ మధ్య వర్తిని అడ్డం పెట్టుకుని వ్యాపారం మొదలెట్టింది. అయితే ఆమె వ్యాపారంలోకి దూకే సమయానికే నిజానికి రియల్ బూమ్ పడిపోయింది. అయితే ఆ హీరో అప్పటికే రియల్ ఎస్టేట్ లో చాలా సంపాదించి ఉండటంతో ఆమె నమ్మి దిగింది. దాంతో ఓ ప్రక్క తెలంగాణ ఉద్యమంతో రియల్ ఎస్టేట్ రేట్లు పడిపోయి ఎవరూ కొనేవారు కనపడటం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చే అవకాసం సుదూర తీరంలో కనపడటం లేదని తేలింది. దాంతో చార్మి మింగలేక కక్కలేక అన్న పరిస్ధితిలో ఆ హీరో వెనక పడితే..తాను కావాలిస్తే..ఓ రెండు ఆఫర్స్ ఇప్పించగలను కానీ ఇప్పుడున్న పరిస్దితిలో భూమిని అమ్మలేమని చేతులు ఎత్తేసాడు. ఇక చార్మి తాజాగా...నాగార్జున చిత్రంలో టైటిల్ సాంగ్ కు డాన్స్ చేసింది. అలాగే ఆమె ప్రధాన పాత్రలో మంగళ చిత్రం చేస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరనేది మీరు ఇప్పటికి ఊహించే ఉంటారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu