చిరంజీవి పాలిటిక్స్‌పై....చార్మి సెటైర్లు?

By Bojja Kumar

హైదరాబాద్: సినిమా నటుడిగా ఉన్నత స్థానాన్ని అందుకున్న చిరంజీవి ఆ తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో చార్మి 'ప్రతిఘటన' అనే చిత్రంలో లేడీ జర్నలిస్టుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు చిరంజీవి పొలిటికల్ లైఫ్‌ను విమర్శించే విధంగా ఉంటాయని ఫిల్మ్ నగర్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో సినిమా విడుదలైతేగానీ తెలియదు.

చరితచిత్ర పతాకంపై చార్మి కీలకపాత్రధారిణిగా తమ్మారెడ్డి భరద్వాజ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రతిఘటన'. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దేశరాజధాని ఢిల్లీలో జరిగి నిర్భయ ఘనటను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈచిత్రం రూపొందుతోంది. ఈచిత్రంలో చార్మి మహిళా జర్నలిస్టుగా నటిస్తోంది. అత్యాచార బాధితురాలి పాత్రలో రేష్మ నటిస్తోంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

గతంలో తెలుగులో విజయశాంతి ప్రధాన పాత్రలో ఓ 'ప్రతిఘటన' సినిమా వచ్చింది. ఇపుడు అదే పేరుతో మరో సినిమా వస్తున్నప్పటకీ.......ఇవి కథాపరంగా పూర్తిగా విభిన్నమైన చిత్రాలు. ఇప్పటికే మంత్ర, సుందరకాండ, మనోరమ, కావ్యాస్ డైరీ, మంగళ, నగరం నిద్రపోతున్న వేళ లాంటి లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో చార్మి నటించింది. వాటి మాదిరిగానే 'ప్రతిఘటన' చిత్రం కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే.

ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని చార్మి ఎంతో నమ్మకంగా ఉంది. సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని, నేటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా సినిమా ఉంటుందని తెలిపారు. సందేశాత్మక సబ్జెక్టు కావడంతో సంగీత దర్శకులు కీరవాణి. నియర్‌ కెమెరామెన్‌ ఎస్‌.గోపాల్‌రెడ్డితో పాటు చార్మి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X